Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేయనున్న సిద్స్‌ ఫార్మ్‌

Advertiesment
Milk
, శనివారం, 6 ఆగస్టు 2022 (20:22 IST)
తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏ2 దేశీ ఆవుపాలను విడుదల చేయనుంది. ఏ2 ఆవు పాలను ఎక్కువ మంది వినియోగదారులు ఇటీవలి కాలంలో అమితంగా వినియోగిస్తున్నారు. అతి సులభంగా జీర్ణం కావడం,  అత్యధిక ప్రొటీన్‌ విలువ, మరింత విస్తృతశ్రేణి రోగ నిరోధక వ్యవస్ధను అందించే లక్షణాలు దీనిలో ఉండటం వల్ల ఇది ప్రాధాన్యతా ఎంపికగా నిలుస్తుంది.

 
ఏ2 పాలకు మరియు సాధారణ పాలకు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే, సాధారణ పాలలో ఏ1 బీటా కాసిన్‌ ఉంటే , ఏ2 పాలలో కేవలం ఏ2 బీటా కేసిన్‌ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఏ2 పాలను ఎక్కువ మంది అభిమానిస్తుంటారు. సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ, ‘‘ప్రతి భారతీయ వినియోగదారునికీ కల్తీ లేని ఉత్పత్తులను ఎంచుకునే స్వేచ్ఛ ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అయినా సిద్ధించాలి. ఎలాంటి యాంటీబయాటిక్స్‌, హార్మోన్లు, నిల్వకారకాలు లేని ఉత్పత్తులను అందిస్తామనే వాగ్ధానం కొనసాగిస్తూ, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ భారతీయ ఆవు జాతులకు చెందిన అత్యున్నత నాణ్యత కలిగిన పాలను గుర్తించే అవకాశం అందిస్తున్నాము’’అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ‘‘గతకొద్ది సంవత్సరాలుగా, వినియోగదారుల కిచెన్‌ మరియు వంటశాలల్లో ప్రత్యేక స్థానాన్ని సిద్స్‌ ఫార్మ్‌ పొందింది. 100% నిజాయితీతో మేము పాలను సరఫరా చేస్తున్నాము. ఏ2 దేశీ ఆవు పాలను విడుదల చేయడమనేది భారతీయ వినియోగదారులకు తాము చేస్తోన్న మరో చక్కటి వాగ్ధానం’’అని అన్నారు. సిద్స్‌ ఫార్మ్స్‌ యొక్క ఉత్పత్తులను బిగ్‌బాస్కెట్‌, జెప్టో, స్విగ్గీ, రిలయన్స్‌ మిల్క్‌ బాస్కెట్‌లో అందిస్తుంది. ఈ కంపె 20-21 ఆర్థిక సంవత్సరంలో 44 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించగా, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అది 65 కోట్ల రూపాయలకు చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడవాళ్లు పుల్ల ఐస్ క్రీమ్ తింటున్నట్లు ప్రకటన, స్త్రీలు ఆ పని చేయరాదంటూ నిషేధం