Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్ లక్ష్య జాబితాలో అనిల్ అంబానీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (10:35 IST)
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైస్ సంస్థ పెగాసస్ లక్ష్య జాబితాలో దేశానికి చెందిన అనేక మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సిబిఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ, దసాల్ట్ ఏవియేషన్ ప్రతినిధి వెంకట రావు ఇలా అనేక మంది ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. 
 
వీరితో పాటు ఫాబ్ ఇండియా మాజీ హెడ్ ఇందర్ జిత్ సియాల్, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ తదితరులు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు ‘వైర్’ తెలిపింది. అనిల్ అంబానీ ఫోన్ కూడా పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలపై రిలయన్స్ గ్రూప్ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వార్తలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా, దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు, సుమారు 40 మంది జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 300 మంది పెగాసస్ లిస్టులో ఉన్నట్టు వచ్చిన వార్తలు దేశాన్ని కుదిపివేస్తున్నాయి. దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విరుచుక పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments