Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయస్సు ఒక సంఖ్య మాత్రమే... సంకల్పమే ముఖ్యం.. ఇదే "జెర్సీ" మూవీ రివ్యూ(Video)

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (14:29 IST)
సినిమా: జెర్సీ
స‌మ‌ర్ప‌ణ‌: పి.డి.వి.ప్ర‌సాద్‌
బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
తారాగ‌ణం: నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్, స‌త్యరాజ్‌, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ తదితరులు
సంగీతం: అనిరుద్ ర‌విచంద్ర‌న్‌
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: గౌత‌మ్ తిన్న‌నూరి
 
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని వాటిని వెండితెరపై ఆవిష్కరించడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో నాని. తాజాగా "జెర్సీ" రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎనిమిది వరుస విజయాలతో విజయపథంలో దూసుకెళ్తూ వచ్చిన నానికి... కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేశాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయినా కూడా నాని పంథాను మార్చుకోకుండా వైవిధ్య‌మైన క‌థాంశంతో చేసిన చిత్ర‌మే 'జెర్సీ'. 36 ఏళ్ల వ్య‌క్తి మ‌ళ్లీ క్రికెట‌ర్ కావాల‌నుకున్న‌ప్పుడు అత‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. చివ‌ర‌కి అత‌ని అనుకున్న‌ల‌క్ష్యాన్ని చేరుకున్నాడా? లేదా అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. పైగా, ఈ చిత్రంలో నాని తండ్రిపాత్రలో నటించాడు. మరి ఈ 'జెర్సీ' చిత్రం ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం. 
 
క‌థ‌ 
అర్జున్‌(నాని) రంజీ ట్రోఫీలో ఆడిన సాధారణ క్రికెట‌ర్‌. అత‌ను సారా (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరికి ఓ కొడుకు పుడతాడు. 26 ఏళ్ల‌ప్పుడు క్రికెట్‌కు స్వస్తి చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతాడు. అలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుకోని ఇబ్బందులు వ‌చ్చి ప‌డుతాయి. లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరార‌న్న పేరుతో ఒక బ్యాచ్ ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేస్తుంది. అందులో అర్జున్ కూడా ఉంటాడు. దాదాపు ప‌దేళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న అత‌ను... తెలిసిన వాళ్లంద‌రి ద‌గ్గ‌ర అప్పులు తీసుకుని గ‌డుపుతుంటాడు. 
 
ఒక సంద‌ర్భంలో కొడుకు అడిగిన చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వ‌లేక‌పోతాడు. దాని కోసం అర్జున్ ఏం చేశాడు? కొడుకు దృష్టిలో హీరోగా మిగ‌ల‌డం కోసం అత‌ను చేసిన ప్ర‌య‌త్నాలేంటి? చివ‌రికి తీర్చ‌గ‌లిగాడా? లేదా? అత‌ని జీవితం చివ‌రికి ఏమైంది? సారాకి నాని పూర్తిగా ఎప్పుడు అర్థ‌మ‌య్యాడు వంటి విష‌యాల‌న్నీ ఈ సినిమాలో స‌స్పెన్స్. 
 
విశ్లేష‌ణ‌ 
నా కెరీర్‌లో ఇప్ప‌టిదాకా నేను ఏ పాత్ర‌నూ షూటింగ్ ఆఖ‌రి రోజు నాతో పాటు ఇంటికి తీసుకెళ్ల‌లేదు. నా ప్రియ‌త‌ముల‌కు సెండ్ ఆఫ్ ఇస్తున్న‌ట్టు భావించ‌లేదు. కానీ 'జెర్సీ' విష‌యంలో అది జరిగింది. నా కెరీర్‌లో అత్యుత్త‌మ చిత్రం 'జెర్సీ' అని నాని పలుమార్లు చెప్పాడు కూడా. అంత ఎందుకు ఎగ్జ‌యిట్ అవుతున్నార‌ని చాలా మంది భావించారు. ఈ చిత్రాన్ని చూస్తే నాని మాటలకు సమాధానం లభిస్తుంది. త‌న కుమారుడు అడిగిన చిన్న కోరిక‌ను తీర్చ‌లేన‌ప్పుడు తండ్రి ప‌డే బాధ‌ను ఇందులో చూడొచ్చు. 
 
న‌చ్చిన వాడి కోసం త‌ల్లిదండ్రుల‌ను కాద‌నుకుని వ‌చ్చిన అమ్మాయి... ఆ త‌ర్వాత‌ త‌న భ‌ర్త ఏమీ చేయ‌క‌పోతే జీవితంలో ఎలా ఒత్తిడి అనుభ‌విస్తుందో చెప్పే క‌థ ఇది. నిలిచి నిదానంగా స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌తిసారీ అక్క‌డి నుంచి వెళ్లిపోయే భ‌ర్త పాత్ర‌లో నాని ఒదిగిపోయాడు. అంతేకాదు, త‌న భార్య త‌న‌ను స‌పోర్ట్ చేసే తీరు, త‌న కుమారుడు త‌న‌ను హీరోలా భావించే విధానానికీ అత‌ను ప్రాణాల‌ను అడ్డుపెట్ట‌డానికి కూడా వెన‌కాడ‌డు. 
 
ఇందులో ప్ర‌తి సన్నివేశం ఏదో ఒక వ‌ర్గానికి ట‌చ్ అవుతుంది. క్రికెట్ ఆట‌ను కూడా ఏదో నామ్‌కే చూపించిన‌ట్టు కాకుండా, ప‌క్కా గ్రౌండ్‌లో తీసిన విధానం చాలా బాగుంది. లొకేష‌న్లు బావున్నాయి. నాని, శ్ర‌ద్ధ‌తో పాటు అంద‌రూ బాగా చేశారు. ఎంక‌రేజింగ్ కోచ్ పాత్ర‌లో స‌త్య‌రాజ్ బాగా సూటయ్యారు. డ‌బ్బు, ప‌లుకుబ‌డి వంటివి ప్లేయ‌ర్ల‌ను సెల‌క్ట్ చేసేట‌ప్పుడు ఎలా ప్ర‌భావితం చేస్తాయో చూపించీ చూపించ‌న‌ట్టు చూపించాడు. ఏదైనా సాధించాల‌నే సంక‌ల్పం ఉన్న వ్య‌క్తికి వ‌య‌సు కేవ‌లం ఒక సంఖ్య మాత్ర‌మే. సంక‌ల్ప‌మే ప్ర‌ధానం అని చెప్పిన సినిమా. 
 
ఈ చిత్రానికి ఉన్న ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, న‌టీన‌టులు న‌ట‌న‌, నేప‌థ్య సంగీతం, సినిమాలో ప‌రిస‌రాలు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, అక్కడక్కడా డైలాగులు, బలమైన ఎమోషన్స్ సీన్లు. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, ఈ చిత్రం తొలిభాగం కాస్త బోర్‌గా సాగుతుంది. చాలాచోట్ల సాగదీతగా ఉంటుంది. ఒకటి రెండు మినహా పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం ఈ చిత్రం మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్య బాబోయ్..అదానీ గ్రూప్‌తో ప్రత్యక్ష ఒప్పందం కుదుర్చుకోలేదు.. వైకాపా

అదానీ దేశం పరువు తీస్తే జగన్ ఏపీ పరువు తీశారు : వైఎస్.షర్మిల (Video)

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments