Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రంకోట ఫేమస్ ఎందుకో తెలుసా! రివ్యూ

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:15 IST)
Rudram kota
నటీనటుటు: జ‌య‌ల‌లిత‌, అనీల్‌, విభీష‌, అలేఖ్య‌ ,బాచి, రమ్య తదితరులు 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: ఆదిమ‌ల్ల‌ సంజీవ్‌, సంగీతం: సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్, నిర్మాత:అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి, దర్శకత్వం: రాము కోన
 
కథ: 
రుద్రంకోట అనే ఊరిలో కోటమ్మ (సీనియర్‌ నటి జయలలిత) ఊరికి పెద్ద దిక్కు. అన్యాయాలు, అక్రమ సంబంధాలు జరిగితే ఆమె వేసే శిక్ష శాసనం. అది వేసేది ఊరికి కాపాలాగా ఉండే రుద్ర (అనిల్‌ ఆర్కా కండవల్లి). రుద్ర ఊరికి పొలిమేలలో శ్మశానాల దగ్గర ఉంటాడు. రుద్ర కోటమ్మను తప్ప  ఏ మహిళను కన్నెత్తి చూడడు. మాట్లాడడు. అలంటి వాడిని ఊరిలో మేకలు కాసుకునే శక్తి (విభీష) ప్రేమిస్తుంది. కానీ  రుద్ర కు నచ్చదు.

అలాంటి కట్టు బాట్లు ఉన్న ఊరిలోకి కోటమ్మ మనవరాలు ధృతి (అలేఖ్య) సిటీ నుంచి వస్తుంది. రాగానే ధృతి, రుద్రపై మోజు పడుతుంది. ధృతి కోరికను తిరస్కరిస్తాడు కూడా. దాంతో ఆమె అహం దెబ్బతింటుంది. మరోవైపు రుద్ర ను శక్తి ప్రేమిస్తుంది అని తెలుసుకున్న ధృతి వారి పేమను దక్కకుండా ప్లాన్ చేస్తుంది. అది ఏమిటీ? ఇక విషయం తెలుసుకున్న  కోటమ్మ తన మనవరాలిని ఊరినుంచి గెంటేస్తుంది. ఆ తర్వాత ఏమిటి అనేది కథ. 
 
సమీక్ష: 
సీరియల్  దర్శకుడు రాము కోన. రాసుకున్న కథ. మారుమూల ఊరిలో కట్టు బాట్లు, పద్ధతులు ఎలా ఉంటాయో చూపించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే న్యాయం. కామంతో తెగిస్తే అది నేరం. ఈ పాయింట్ ను హైలెట్ చేసాడు. కామానికి కళ్ళు లేవు అనేది సన్నివేశపరంగా చూపించాడు. కానీ ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ హీరో పాత్రను తీర్చి దిద్దిన తీరు బాగుంది.
 
హీరో పాత్ర శివపుత్రుడు తరహాలో ఉంటుంది. తను ఆ హావభావాలు పలికించాడు. శివ తాండవం బాగా చేసాడు. నటుడిగా కెరీర్ ఉంది. మిగతా నటీనటులు బాగానే చేశారు. ఇక ప్రతేకంగా కోటమ్మ గా సీనియర్‌ నటి జయలలిత హైలెట్. ఆమె ఈ సినిమాకు కీలకం. రుద్ర ఎంట్రీ సీన్‌ బాగుంటుంది. ఎలాంటి సాగదీత లేకుండా మొదట్లోనే ముఖ్యమైన పాత్రలు..వాటి నేపథ్యాన్ని చూపించారు. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కానీ కొన్ని  రొటీన్‌ సన్నివేశాలతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. సెకండాఫ్‌ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. శక్తి, రుద్ర మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. డైలాగులులో ఇంకా ఎఫెక్ట్ ఉంటె బాగుండేది. దర్శకుడు అనుభవం మేరకు తీసాడు. ధృతి పాత్ర అలేఖ్య ఇప్పటి సిటీ కల్చర్ కు నిదర్శనం గా చూపించాడు. 
 
ఇక సినిమాటోగ్రఫీ తో పల్లెటూరి అందాలను చక్కగా కెమెరాలో బంధించాడు.  కోటి నేపథ్య సంగీతం జస్ట్‌ ఒకే. సుభాష్ ఆనంద్‌, నిరంజ‌న్ రాసిన పాటల్లో జీవితము కనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ ను ఇంకా నేర్పుగా తీస్తే మరింత బాగుండేది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇలాంటి కథలు ఓ.టి.టి.కి సరికొత్తగా అనిపిస్తాయి.
రేటింగ్: 2.5/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ : డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏమిటి?

చంద్రబాబుతో గోడు చెప్పుకున్న టి. నిరుద్యోగులు.. రేవంతన్నకు చెప్పండి ప్లీజ్! (video)

భారత జోడో యాత్రకు వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి-రాహుల్ (video)

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం.. ఇవన్నీ ఫాలో ఐతే బ్యూటీ మీ సొంతం అవుతుంది..

మారిపోతున్న పిఠాపురం రూపురేఖలు.... బస్టాండుకు కొత్త హంగులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments