Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో యానిమల్ న్యూ పోస్టర్‌ విడుదల

Ranbir Kapoor look
, సోమవారం, 18 సెప్టెంబరు 2023 (16:34 IST)
Ranbir Kapoor look
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ పీస్ 'యానిమల్'.. మోస్ట్ ఎవైటింగ్ ఆడ్రినలిన్, ఎక్సయిటింగ్ పవర్ ఫుల్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం బ్రాండ్ న్యూ పోస్టర్‌ను మేకర్స్ విడుదల  చేశారు. పోస్టర్ పర్ఫెక్ట్ గా వుంది.  ఇది పోస్టర్ మాత్రమే కాదు.. రణబీర్ కపూర్ పాత్ర, సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఇంటెన్స్ గా  వుంటుందో సూచిస్తోంది.
 
'యానిమల్' భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాలు..వెర్సటైల్ యాక్టర్ రణబీర్ కపూర్, విజనరీ రచయిత-దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ని  కలిపే ఒక క్లాసిక్ సాగా. ఈ గ్రాండ్ వెంచర్ వెనుక ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ వున్నారు. అనిల్ కపూర్, రష్మిక మందన, బాబీ డియోల్,  త్రిప్తి డిమ్రీ.. భారీతారాగణం ఈ సినిమాటిక్ మాస్టర్‌పీస్ లో వుంది. ప్రేక్షకులకు విజువల్, ఎమోషనల్ ట్రీట్ ని అందించనుంది.  
 
యానిమల్‌ను భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్ , ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం - 5 భాషల్లో విడుదల కానుంది.
 
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనసూయ, వరలక్ష్మి శార్థకుమార్ మధ్య యుద్ధం