Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డార్క్ క్రైమ్ ఎంటర్ టైనర్ లో ఇద్దరు పృద్వి రాజ్ నటిస్తున్న చిత్రం భ్రమర

Nikta,prudhivi clap venugopal
, బుధవారం, 20 సెప్టెంబరు 2023 (16:49 IST)
Nikta,prudhivi clap venugopal
నికితశ్రీ, సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి , పృద్వి రాజ్(పెళ్లి), నాగమహేష్, జయవాణి,మీసాల లక్ష్మణ్, జబర్దస్త్ అప్పారావు, ఆకెళ్ళ, దువ్వాసి మోహన్, పసునూరి శ్రీనివాస్, మాణిక్యం, టార్జాన్ నటీ నటులుగా టి.వి రవి నారాయణన్ దర్శకత్వంలో జి.మురళీ కృష్ణ నిర్మాణ సారద్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం  "భ్రమర". హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నిర్మాత బెక్కం వేణుగోపాల్  చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కుర్మచలం  కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి  రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం  వహించారు. 
 
అనంతరం గెస్ట్ గా వచ్చిన హైకోర్ట్ అడ్వకేట్ సుంకర నరేష్  మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. అయితే ప్రజలను అవగాహన పరస్తూ ప్రజలలో చైతన్యం తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో  దర్శక, నిర్మాతలు డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్స్ లో "భ్రమర" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ టైటిల్ లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా అటువంటి సౌండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు మీడియా తో పాటు  ప్రేక్షకులు కూడా సపోర్ట్ చేస్తూ మూవీ యూనిట్ ను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
 సహ నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. రవి మంచి కాన్సెప్ట్ ఉన్న కథ చెప్పడంతో ఈ సినిమా తీద్దామనుకున్నాను. అయితే నాకు నిర్మాత మురళీ కృష్ణ గారు సపోర్ట్ గా రావడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు, హైదరాబాద్ లలో శర వేగంగా షూటింగ్ జరుపుకొని ఇదే సంవత్సరంలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
 
చిత్ర దర్శకుడు టి.వి రవి నారాయణన్ మాట్లాడుతూ..డార్క్ క్రైమ్స్ బ్యాక్ డ్రాప్ మీద ఈ  సినిమా నడుస్తుంది. .ఈ కథను కళ్యాణ్ గారికి ప్రొడ్యూసర్ మురళి కృష్ణ గారికి చెప్పగానే కథ నచ్చి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాను ఊటీ బ్యాక్ డ్రాప్ లో తీద్దాం అనుకున్నాము. అయితే ఊటీ కంటే అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని ఢిల్లీ, కొల్ కత్తా, చిక్మంగళూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా రాహుల్ శ్రీ వాత్సవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా కార్తీక్ బి. కొడగండ్ల చేస్తున్నారు. ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ నటులు 30 ఇయర్స్ పృద్వి ,పెళ్లి సినిమా పృద్వి రాజ్ తో పాటు నికితశ్రీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇంకా ఇందులో నటిస్తున్న మిగతా నటీ, నటులు అందరిని త్వరలో తెలియజేస్తాము. అందరూ బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ సినిమా