యు ట‌ర్న్ సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్..

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (13:06 IST)
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు ప్ర‌మోష‌న‌ల్ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెండింటికి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. 
 
యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్‌లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన‌ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు. 
 
స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ ర‌వీంద్ర‌న్, న‌రైన్ తదిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్, నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు, బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్, సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి
సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి, ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్, ఎడిటర్: సురేష్ ఆర్ముగం, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పట్టపగలే దొంగ కంటపడ్డాడు.. తరుముకున్న బాలిక.. చుక్కలు చూపించిందిగా (video)

సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బాబుకి ప్రధానమంత్రి మోడి విషెస్

మా చిలుక కనబడుటలేదు, ఆచూకి చెబితే ఐదు వేలు ఇస్తాం

తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు వర్షాలు తప్పవు..

మంచినీళ్లు అనుకుని సలసలలాడే టీని తాగేశాడు, మృతి చెందాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments