Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''శైలజారెడ్డి అల్లుడు''తో పోటీ పడటం నాకు ఇష్టం లేదు: సమంత

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజా సినిమా యూటర్న్ విడుదలకు సిద్దమవుతోంది. అలాగే ఆమె భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Advertiesment
Samantha
, సోమవారం, 3 సెప్టెంబరు 2018 (16:56 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజా సినిమా యూటర్న్ విడుదలకు సిద్దమవుతోంది. అలాగే ఆమె భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 
 
భార్యాభర్తలిద్దరూ ఒకేసారి థియేటర్లోకి వచ్చి సినిమాల విషయంలో పోటీ పడనున్నారని సోషల్ మీడియాలో చెయ్ వర్సెస్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సమంత చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారాయి. శైలజారెడ్డి అల్లుడు సినిమాతో తన సినిమా పోటీ పడడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని సమంత స్పష్టం చేసింది. 
 
శైలజారెడ్డి అల్లుడు సినిమాతో పోటీపడేందుకు తనకు ఇష్టం లేదని సమంత తెలిపింది. ఈ విషయంపై దర్శకనిర్మాతలకు ఎంతగా చెప్పినా.. వారు మాత్రం తన మాట పెద్దగా పట్టించుకోలేదనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 
 
అంతేకాకుండా యూటర్న్ దర్శకనిర్మాతలు సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలని, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా చైతన్య సినిమాతో పోటీగా విడుదల చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 
 
కానీ రెండు సినిమాలు వేర్వేరు జానర్లలో వుండటంతో రెండూ హిట్ అవుతాయనే నమ్మకం వుందని సమంత ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో పెప్పీ యూ టర్న్ సాంగ్‌లో స్టెప్స్ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బింగ్ నేనే చెప్పుకుంటానంటున్న పంజాబీ భామ