Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌మంత యు ట‌ర్న్ వ‌చ్చేస్తోంది...

స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన చిత్ర యు టర్న్. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన యు ట‌ర్న్ ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మిళ‌, తెలుగులో క‌లిపి దాదాపు 6.5

Advertiesment
స‌మంత యు ట‌ర్న్ వ‌చ్చేస్తోంది...
, బుధవారం, 29 ఆగస్టు 2018 (20:52 IST)
స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన చిత్ర యు టర్న్. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన యు ట‌ర్న్ ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. త‌మిళ‌, తెలుగులో క‌లిపి దాదాపు 6.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. యు ట‌ర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, త‌మిళ్‌లో తెర‌కెక్కించారు. రెండు భాష‌ల్లోనూ ఒకేరోజు విడుద‌ల కానుంది ఈ చిత్రం. 
 
ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడంటారా.. సెప్టెంబ‌ర్ 13న‌. రాహుల్ ర‌వీంద్ర‌న్, భూమికా చావ్లా యు ట‌ర్న్‌లో కీల‌క‌ పాత్ర‌ల్లో న‌టించారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పైన శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు. 
 
స‌మంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ ర‌వీంద్ర‌న్, న‌రైన్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి క‌థ‌, ద‌ర్శ‌కుడు: ప‌వ‌న్ కుమార్ నిర్మాత‌లు: శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు, బ్యాన‌ర్స్: శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్, సంగీతం: పూర్ణచంద్ర తేజ‌స్వి సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి, ఆర్ట్ డైరెక్ట‌ర్: ఏఎస్ ప్ర‌కాశ్, ఎడిటర్: సురేష్ ఆర్ముగం, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలో నాగ‌శౌర్య @న‌ర్త‌న‌శాల‌.!