Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌మంత‌కి షాక్ ఇచ్చిన‌ చైతు... అస‌లు ఏం జ‌రిగింది..?

స‌మంత‌కి షాక్ ఇచ్చాడ‌ట చైత‌న్య‌. అవును.. ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... అక్కినేని నాగ చైత‌న్య - మారుతి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'శైల‌జారెడ్డి అల్లుడు'.

Advertiesment
స‌మంత‌కి షాక్ ఇచ్చిన‌ చైతు... అస‌లు ఏం జ‌రిగింది..?
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (18:28 IST)
స‌మంత‌కి షాక్ ఇచ్చాడ‌ట చైత‌న్య‌. అవును.. ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... అక్కినేని నాగ చైత‌న్య - మారుతి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'శైల‌జారెడ్డి అల్లుడు'. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ.. రీ రికార్డింగ్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేశారు.
 
రీ రికార్డింగ్‌తో పాటు వెన్నెల కిషోర్, చైత‌న్యలపై కొన్ని సీన్స్ కూడా చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ని... సెప్టెంబ‌ర్ 1, 2 తేదీల్లో ఈ సీన్స్ చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఇక రిలీజ్ విష‌యానికి వ‌స్తే... సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసి స‌మంత షాక్ అయ్యింద‌ట‌. కార‌ణం ఏంటంటే.. స‌మంత న‌టించిన 'యు ట‌ర్న్' చిత్రం సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కానుంది. 
 
అందుచేత 'శైల‌జారెడ్డి అల్లుడు' చిత్రాన్ని కాస్త అటు ఇటు డేట్ మార్చుదాం అంటే డిస్ట్రిబ్యూట‌ర్స్ ఒప్పుకోవ‌డం లేద‌ట‌. అందుచేత సెప్టెంబ‌ర్ 13నే రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అదీ.. సంగ‌తి. మ‌రి.. సెప్టెంబ‌ర్ 13వ తేదీన జ‌రిగే బాక్సాఫీస్ వార్‌లో చైతు, స‌మంత ఇద్ద‌రిలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సిల్లీ ఫెలోస్' మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే.. షాక్ అవుతారు...