Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ చైత‌న్య‌, స‌మంత‌ల సినిమా టైటిల్ ఇదే...

అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఏమాయ చేసావే, మ‌నం, ఆటో న‌గ‌ర్ సూర్య చిత్రాల్లో న‌టించారు. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోనున్న ఈ మూవీ ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్ట

Advertiesment
నాగ చైత‌న్య‌, స‌మంత‌ల సినిమా టైటిల్ ఇదే...
, గురువారం, 16 ఆగస్టు 2018 (19:05 IST)
అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత క‌లిసి ఏమాయ చేసావే, మ‌నం, ఆటో న‌గ‌ర్ సూర్య చిత్రాల్లో న‌టించారు. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తోన్న విష‌యం తెలిసిందే. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోనున్న ఈ మూవీ ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఇందులో వీరిద్ద‌రు భార్య‌భ‌ర్త‌ల వ‌లే న‌టిస్తున్నారు. ఈ మూవీకి ప్రేయ‌సి అనే టైటిల్ ఖరారు చేయ‌నున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వచ్చాయి.
 
అయితే.. తాజాగా ఈ సినిమాకి మజలీ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించడంతో ఈ టైటిల్ బ‌ట‌య‌కు వ‌చ్చింది. ఈ నెల‌లోనే షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు, ఈ నెల 31న రిలీజ్ అవుతుండ‌గా, స‌మ‌ంత న‌టించిన యు ట‌ర్న్ చిత్రం సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరాఫ్ కంచ‌ర‌పాలెం రానా రిలీజ్ చేయ‌డానికి కార‌ణం..?