అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ టోకెన్ నాదే... చైతుకి సమంత షాక్(Video)
నాగ చైతన్య, సమంత ఇద్దరు ఏమాయ చేసావే చిత్రంలో నటించడం.. ఆ సినిమా సంచలన విజయం సాధించడం..తెలిసిందే. అందులో నటించినట్టే నిజ జీవితంలో ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే... సుశాంత్ నటించిన తాజా చిత్రం చి.ల.సౌ. రాహుల్ రవీంద్రన్ దర్
నాగ చైతన్య, సమంత ఇద్దరు ఏమాయ చేసావే చిత్రంలో నటించడం.. ఆ సినిమా సంచలన విజయం సాధించడం..తెలిసిందే. అందులో నటించినట్టే నిజ జీవితంలో ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే... సుశాంత్ నటించిన తాజా చిత్రం చి.ల.సౌ. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా చైతన్య, సమంత మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు.
ఈ ప్రెస్ మీట్లో ఆ తర్వాత చైతన్య మాట్లాడుతూ... నాకు సమంత ఏ మాయ చేశావె నుంచి తెలుసు. ఏడేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. చివరకు పోన్లే పాపం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నాడు కదా అని రెండేళ్ల క్రితం ఓకే చెప్పింది. అప్పటి నుంచి ప్రేమించుకున్నాం. కానీ పదేళ్లకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వేరే ఆప్షన్ లేక అని నవ్వుతూ చెప్పాడు. ఇందుకు సమంత స్పందిస్తూ.. నీ గురించి బయట చాలా బ్యాడ్‌గా విన్నా బాబూ..’ అనడంతో అక్కడున్నవారంతా నవ్వుకున్నారు.
అంతేకాకుండా... ఎంత పబ్లిక్‌గా అబద్ధం ఆడేస్తున్నాడో. నేను ఆయన వెంట మాత్రమే పడ్డాను. కానీ చైతూ చాలామంది అమ్మాయిల వెంట పడ్డాడు. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ టోకెన్ నాదే అని నవ్వుతూ చెప్పింది. అయితే.. చైతు చెప్పింది నిజమో..? లేక సమంత చెప్పింది నిజమో తెలియదు కానీ.. ఈ జంట ఇలా సరదాగా ప్రెస్ మీట్లో మాట్లాడటం అక్కడున్న వారందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. చూడండి వీడియో...