Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరాఫ్ కంచ‌ర‌పాలెం రానా రిలీజ్ చేయ‌డానికి కార‌ణం..?

ద‌గ్గుబాటి రానా స‌మ‌ర్ప‌ణ‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రం కేరాఫ్ కంచ‌ర‌పాలెం. ఈ సినిమా రిలీజ్ కాకుండానే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... వైజాగ్‌లో గ‌ల కంచ‌ర‌పాలెంలో అక్క‌డ ఉన్న న‌టీన‌టుల‌తో రూపొందిన చిత్ర‌మిది. ఈ సినిమా సు

కేరాఫ్ కంచ‌ర‌పాలెం రానా రిలీజ్ చేయ‌డానికి కార‌ణం..?
, గురువారం, 16 ఆగస్టు 2018 (18:52 IST)
ద‌గ్గుబాటి రానా స‌మ‌ర్ప‌ణ‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రం కేరాఫ్ కంచ‌ర‌పాలెం. ఈ సినిమా రిలీజ్ కాకుండానే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... వైజాగ్‌లో గ‌ల కంచ‌ర‌పాలెంలో అక్క‌డ ఉన్న న‌టీన‌టుల‌తో రూపొందిన చిత్ర‌మిది. ఈ సినిమా సురేష్ బాబుకి తెగ న‌చ్చేసింద‌ట‌. అంతే ఈ సినిమాని త‌మ సంస్థ ద్వారా రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇన్నాళ్ల‌కు టైమ్ వ‌చ్చింది. రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్లో చాలామంది సినీ ప్ర‌ముఖులు ఈ సినిమాని చూసారు. వారంద‌రికీ కూడా న‌చ్చేయ‌డంతో బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను రానా ట్విట్ట‌ర్లో రిలీజ్ చేసారు. 
 
ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే... విశాఖపట్నంలోని కంచరపాలెంలో రైల్వే ట్రాక్ చూపిస్తూ ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. 49 ఏళ్లు వచ్చిన రాజుగాడికి పెళ్లి కాకపోవడంతో ఆడోళ్లు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. మగోళ్లంతా భయపడుతున్నారంటూ చాటింపు వేయడంతో ఒక పాత్రను పరిచయం చేశారు. అలాగే, మరో మూడు పాత్రలను కూడా ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. చివరిలో 49 ఏళ్ల రాజు పెళ్లి కోసం ఏకంగా పంచాయతీయే పెట్టేయడం నవ్వు తెప్పిస్తుంది.
 
డైరెక్ట‌ర్ మ‌హి ఈ చిత్రాన్ని చాలా సహజంగా తెరకెక్కించారు. రానాతో పాటు విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది న్యూయార్క్‌ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ విభిన్న‌మైన చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేయ‌నున్నారు. మ‌రి.. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఎంతవ‌ర‌కు స‌క్స‌ెస్ అవుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకా చోప్రా అంటే పిచ్చ... అందుకే తలుపులు మూసి ఆ పని చేశాడు...