Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు వసంతాల 'బాహుబలి ది బిగినింగ్'

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'బాహుబలి ది బిగినింగ్'. ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అదేసమయ

Advertiesment
Baahubali: The Beginning
, మంగళవారం, 10 జులై 2018 (14:16 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'బాహుబలి ది బిగినింగ్'. ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అదేసమయంలో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నమోదైన అన్ని రికార్డులను తిరగరాసింది.
 
అయితే, తొలి భాగం జూలై 10, 2015న విడుద‌లైంది. నేటితో ఈ చిత్రం మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. 'బాహుబ‌లి' సినిమా ప్ర‌భాస్ రేంజ్‌ని పూర్తిగా మార్చేసింది. హిందీ నిర్మాత‌ల నుండి ప్ర‌భాస్‌కి భారీ ఆఫర్స్ వ‌స్తున్నాయి. 
 
అద్భుత దృశ్యకావ్యంగా తెర‌కెక్కిన 'బాహుబ‌లి' చిత్రం 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కగా, ఇందులో స‌న్నివేశాలు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుని దోచుకున్నాయి. చైనాలోనూ ఈ చిత్రం వ‌సూళ్ల సునామి సృష్టించింది. అంటే 'బాహుబ‌లి' ప్ర‌భంజ‌నం ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ చిత్రంలో పని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. 'బాహుబ‌లి-2'లో అమాయ‌కుడి పాత్ర పోషించిన సుబ్బ‌రాజుకి జ‌పాన్ ప్రేక్ష‌కులు ఇటీవ‌ల ఘ‌నస్వాగతం ప‌లికిన విషయం ప్రతి ఒక్కరూ మరచిపోలేనిది. 
 
అదేసమయంలో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన 'బాహుబ‌లి' చిత్రం పాఠ్యాంశంగా కూడా ప్ర‌చురిత‌మైంది. ప్రతిష్టాత్మక అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థుల మేనేజ్‌మెంట్ సిలబస్‌లో 'బాహుబలి'ని ఓ అంశంగా చేర్చిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. 
 
బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్‌ బుక్స్‌, ఏనిమేషన్‌ సిరీస్‌, మర్చెంట్‌ డైస్‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. 'బాహుబ‌లి'కి సీక్వెల్‌గా వ‌చ్చిన 'బాహుబ‌లి-2' చిత్రం 65వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌లో భాగంగా ఉత్తమ యాక్షన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ప్రజాదారణ పొందిన చిత్రంగా అవార్డులను గెలుచుకుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్‌ ముద్దులు పెట్టాలని గోల చేస్తున్న హీరోలు...