ఎన్టీఆర్ బయోపిక్ : చంద్రబాబుగా రానా.. లక్ష్మీపార్వతిగా పూజా కుమార్
ఎన్.బి.కే ఫిలిమ్స్.. వారాహి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయిదే, ఈ చిత్రంలో వివిధ పాత్రల కోసం టాలీవుడ
ఎన్.బి.కే ఫిలిమ్స్.. వారాహి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయిదే, ఈ చిత్రంలో వివిధ పాత్రల కోసం టాలీవుడ్ హీరోలను ఎంపిక చేస్తున్నారు. సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య, కృష్ణ పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు వంటివారు నటిస్తున్నారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రని రానా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబు, రాజశేఖర్ కూడా ఈ బయోపిక్‌లో ముఖ్య పాత్రలు చేయనున్నారట. చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఫిలిం సిటీలోను, రామకృష్ణ సినీ స్టూడియోలో చిత్రీకరించున్నారు. ఎన్టీఆర్ చిత్రాన్ని పలు భాషలలో సినిమాని విడుదల చేయాలని భావిస్తున్న బాలయ్య పాత్రల ఎంపికలో మంచి పేరున్న నటీనటులనే తీసుకోమని చెప్పాడంతో ఈ క్రమంలో దర్శక నిర్మాతలు అడుగులు వేస్తున్నారని చిత్ర పరిశ్రమలోని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, 'లక్ష్మీస్ వీరగ్రంధం' అనే చిత్రంలో లక్ష్మీ పార్వతిగా 'గరుడవేగ' చిత్ర హీరోయిన్ పూజా కుమార్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. నిజానికి అయితే ఈ 'లక్ష్మీస్ వీరగ్రంధం'లో లక్ష్మీ పార్వతి పాత్రని రాయ్ లక్ష్మీ చేయనుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు పూజా కుమార్ పేరును ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలిపాడు.
వీరగంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్న ఆసక్తికర విషయాలను ఈ సినిమాలో తెలపనున్నాడు కేతిరెడ్డి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషించనున్న సంగతి తెలిసిందే. పూజా కుమార్ రీసెంట్‌గా 'గరుడవేగ'లో నటించగా, ఈ అమ్మడి నటనకి మంచి మార్కులు పడ్డాయి.