Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సిల్లీ ఫెలోస్' మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే.. షాక్ అవుతారు...

అల్ల‌రి న‌రేష్ - సునీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫుల్‌లెంగ్త్ ఎంట‌ర్‌టైన‌ర్ 'సిల్లీ ఫెలోస్'. అస‌లు.. వీరు తెరపై క‌నిపిస్తే చాలు... న‌వ్వులే న‌వ్వులు. అలాంటిది వీరిద్ద‌రు క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్త

Advertiesment
'సిల్లీ ఫెలోస్' మోష‌న్ పోస్ట‌ర్ చూస్తే.. షాక్ అవుతారు...
, శుక్రవారం, 24 ఆగస్టు 2018 (18:26 IST)
అల్ల‌రి న‌రేష్ - సునీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫుల్‌లెంగ్త్ ఎంట‌ర్‌టైన‌ర్ 'సిల్లీ ఫెలోస్'. అస‌లు.. వీరు తెరపై క‌నిపిస్తే చాలు... న‌వ్వులే న‌వ్వులు. అలాంటిది వీరిద్ద‌రు క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్తే... ఇక ఎంట‌ర్ టైన్మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ప్రేక్ష‌కులు ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా స‌రే... అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా క‌డుపుబ్బా న‌వ్వించేస్తాం అంటున్నారు ఈ సిల్లీ ఫెలోస్. అవును.. ఇప్పుడు న‌రేష్ - సునీల్ క‌లిసి సిల్లీ ఫెలోస్ అంటూ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డానికి రెడీ అయ్యారు.
 
వీరిద్ద‌రికితోడు హాస్యాన్ని అద్భుతంగా పండించ గ‌ల డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీనివాస‌రావు క‌లిస్తే.. ఇక ఆ సినిమా ఏ స్ధాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా రూపొందిన 'సిల్లీ ఫెలోస్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూప్లానెట్ ఎంట‌ర్‌టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'సిల్లీ ఫెలోస్' మోష‌న్ టీజ‌ర్‌ను అల్ల‌రి న‌రేష్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. మోష‌న్ పోస్ట‌ర్‌లో డైలాగులు ఉండ‌వు కానీ.. వీళ్లు కొత్త‌గా డైలాగ్‌తో మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. అయితే.. టైటిల్‌కి త‌గ్గ‌ట్టే ఈ మోష‌న్ పోస్ట‌ర్ చాలా సిల్లీగా ఉంది. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఆగాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్ అందానికి దాసోహమంటున్న దర్శకులు..ఎవరు..?