Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లైనా సమంత తగ్గలేదే.. ఆ విషయంలో అదరగొట్టేసింది..

టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత ప్రస్తుతం యూటర్న్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొంది

Advertiesment
పెళ్లైనా సమంత తగ్గలేదే.. ఆ విషయంలో అదరగొట్టేసింది..
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:22 IST)
టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత ప్రస్తుతం యూటర్న్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. 
 
ఆల్బమ్ తరహాలో ఈ ప్రమోషనల్ సాంగ్‌‍ను అనిరుధ్ ఆలపిస్తుండగా, సమంత డాన్స్ చూపించారు. అలాగే సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాల బిట్స్‌ను కూడా ఈ సాంగ్‌కి జోడించారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మరోవైపు వివాహమైనా, గ్లామర్ రోల్స్‌ను వదలకుండా, ఫ్యాన్స్‌ను అలరిస్తున్న సమంత, కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తీకేయన్‌తో ఓ సీన్ పండించిందట. అది కూడా రొమాన్స్‌లో అదరగొట్టింది. సీమరాజా పేరిట తమిళంలో ఆమె శివకార్తికేయన్ సరసన నటించగా, ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లగా కనిపిస్తుండగా, శివకార్తికేయన్ మాస్ లుక్‌‌లో అదరగొడుతున్నాడు. ట్రైలర్‌లో సమంతను శివ ఎత్తుకునే ఓ సీన్ ఉండగా, దాని స్క్రీన్ షాట్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇప్పటివరకూ సమంత, తాను నటించిన ఏ చిత్రంలోనూ ఇటువంటి సీన్ చేయలేదట. దీంతో ఈ సీన్ చూసిన వారంతా గ్లామర్ పరంగా సమంత ఏమాత్రం వెనక్కి తగ్గలేదే అంటున్నారట. సమంతతో పాటు సిమ్రాన్, నెపోలియన్ తదితరులు నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఫ‌స‌క్'పై మోహ‌న్ బాబు ట్వీట్... షాకైన నెటిజ‌న్లు..!