Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూత్ స్పైడర్ మ్యాన్ కు ఓటేశారు- పుష్ప కు దెబ్బ ప‌డింది

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (23:39 IST)
Spider-Man, Pushpa
తెలుగు సినిమాకు ఇంగ్లీషు సినిమా దెబ్బ కొట్ట‌డం అనేది రేర్ కేస్‌. త‌మిళం, మ‌ల‌యాళ సినిమాలు పోటీగా వ‌స్తుంటాయి. కాగా, ఈసారి పుష్ప రిలీజ్ నాడే స్పైడర్ మ్యాన్ విడుద‌ల‌కావ‌డం ప‌ట్ల ముందుగానే పంపిణీదారులు పుష్ప‌కు దెబ్బ ప‌డుతుంద‌ని అనుకున్నారు. అలాగే దెబ్బ‌ప‌డింది. ఇండియా వైడ్‌గా స్పైడర్ మ్యాన్ కు ఆద‌ర‌ణ మామూలుగా లేదు. రెండురోజుల క్రిత‌మే హైద‌రాబాద్‌లో స్పైడర్ మ్యాన్ షో ప్ర‌ద‌ర్శించారు. అందులో విన్యాసాల‌కు యూత్ ఫిదా అయిపోయారు. మీడియాకు ఆ సినిమా చూపించారు. ముగ్గ‌రు స్పైడర్ మ్యాన్ లు ఈ సినిమాఓల సంద‌ర్భానుసారంగా క‌నిపించ‌డంతోపాటు ఊహాతీత‌మైన గ్రాఫిక్స్ స‌న్నివేశాలు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌ను క‌ట్టిప‌డేశాయి. 
 
అయితే, రొటీన్ క‌థ‌తో రూపొందిన పుష్ప‌కు యూత్ పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగున్నా క‌థంతా పాత‌కాల‌పు క‌థ కావిడంతో యూత్ పెద్ద‌గా రాలేదు. ఎలాగూ మ‌హిళాలు ఈ సినిమాకు పెద్ద‌గా హాజ‌రుకాక‌పోవ‌డం మైన‌స్‌గా మారింది. దాంతో ముందుగా బుక్ అయిన టికెట్ల ప్ర‌కారం ఆదివారం వ‌ర‌కు హౌస్‌ఫుల్‌తో న‌డుస్తుంది. సోమ‌వారంనుంచి క‌లెక్ష‌న్లు పెద్ద‌గా వుండ‌మ‌నీ కొంద‌రు ఎగ్జిబిర్ల‌రు వాపోవ‌డం విశేషం.
 
ఇక  ఇండియాలో హాలీవుడ్ సినిమాలలో ‘స్పైడర్ మ్యాన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ లో రెండో స్థానంలో నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ సినిమా మొదటి రోజున ఏకంగా 32.67 కోట్ల నెట్ వసూళ్ళు సాధించిందని అంటున్నారు  ‘పుష్ప’ ఐదు భాష‌ల్లో విడుద‌లైనా ప్ర‌యోజ‌నం లేదు. నార్త్‌లో వారిని ఎట్రాక్ట్ చేసే అంశాలేవీ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అయ్యింది.
 
అస‌లు పుష్ప సినిమా 17న విడుద‌ల‌కాద‌ని సీనియ‌ర్ నిర్మాత ముందుగానే వెల్ల‌డించారు. టెన్నిక‌ల్ వ‌ర్క్ ఇంకా పూర్తికాలేదు. స‌మంత సాంగ్ కూడా స‌రిగ్గా రాలేద‌ని చెప్పాడు. ఆయ‌న అన్నట్లు స‌మంత సాంగ్‌లో లిప్ సింగ్ కొన్నిచోట్ల అస్స‌లు సెట్ కాలేదు. ఏదో హ‌డావిడిగా చేసిన‌ట్లు క‌నిపించింది. సీని విశ్లేష‌కుల స‌మాచారం ప్ర‌కారం సోమ‌వారం నుంచి పుష్ప‌కు పెద్ద‌గా క‌లెక్ష‌న్లు వుండ‌వ‌ని తెలియ‌జేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments