Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శ్యామ్ సింగ రాయ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. మరో పాట రిలీజ్

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (22:28 IST)
నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో "శ్యామ్ సింగ రాయ్" పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.
 
ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ టీమ్ యూ అండ్ ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నిడివి ఉండనుంది. దీనికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌‌ను టీమ్ భారీగా నిర్వహించింది. మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'ఏదో ఏదో' అంటూ సాగే ఈ ప్రేమగీతానికి మిక్కీ జె. మేయర్‌ మంచి వినసొంపైన సంగీతం అందించారు. ఈ పాటకు కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించగా.. చైత్ర అంబడిపుడి పాడారు.
 
నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. నాని, హీరోయిన్ కృతి శెట్టిల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్‌లో మూడు మిలియన్ వ్యూస్‌ సాధించి అదరగొడుతోంది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్తి గారు రాసిన 'ప్రణవాలయ' సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments