కేజీఎఫ్‌ యశ్‌కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. అన్నదానం..?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (14:36 IST)
కేజీఎఫ్‌తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యశ్. ప్రస్తుతం కేజీఎఫ్-2 షూటింగ్‌లో బిజీగా వున్నాడు. కేజీఎఫ్‌తో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఏపీలలో ఆయనకు అభిమాన సంఘాలు వెలిశాయి. అయితే తమిళనాడుకు చెందిన ఒక అభిమాన సంఘం ఆయనకు మరింత కీర్తిని తెచ్చి పెట్టే పని చేస్తుంది.
 
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని యశ్ అభిమాన సంఘం చేస్తున్న పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. ధర్మపురిలోని Rocking star Yash Fans club పేరు మీద ఉన్న అభిమాన సంఘానికి చెందిన సభ్యులు ప్రతినెలా 8న అనాథలకు అన్నదానం చేస్తున్నారు. 
 
ఒక అనాథశ్రమానికో లేదంటే.. ఒక ఫంక్షన్ హాల్‌లోనో పేదవారికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా జరుపుతున్నారు యశ్ అభిమానులు. ప్రతినెలా 8నే ఎందుకంటే.. జనవరి 8 న యశ్ జన్మదినం కాబట్టి. ఇకపోతే.. యశ్ నటిస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2 సినిమా జూలై 16న తెరపైకి రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లండన్, సింగపూర్ లాంటి రాజధాని ఎందుకు?: అంబటి రాంబాబు (video)

Tirumala Adulterated Ghee Case: లడ్డూ నేతిలో కల్తీ... టీటీడీ ఉద్యోగులే అంత పనిచేశారా?

కోనసీమ అందంపై దిష్టిపడిందా.. పవన్ క్షమాపణ చెప్పాలి.. హైదరాబాద్‌లో ఆస్తులెందుకు?

3 జోన్ల వృద్ధికి అన్నీ సిద్ధం.. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి-చంద్రబాబు

Nara Brahmani: హిందూపూర్ వస్తే మాతృభూమికి తిరిగి వచ్చినట్టుంది: నారా బ్రాహ్మణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments