Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేజీఎఫ్ స్టార్ యాష్‌కు బర్త్ డే.. #KGFChapter2Teaser రిలీజ్.. వైరల్

Advertiesment
కేజీఎఫ్ స్టార్ యాష్‌కు బర్త్ డే.. #KGFChapter2Teaser రిలీజ్.. వైరల్
, శుక్రవారం, 8 జనవరి 2021 (07:55 IST)
yash
కేజీఎఫ్ స్టార్ యాష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన యాష్.. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చిత్రంలో యష్ పర్‌ఫార్మెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అతని బాడీ లాంగ్వేజ్‌, మెచ్యూరిటీ పర్‌ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. అందుకే ఇప్పుడు యష్ సినిమాలంటే థియేటర్స్ కళకళలాడుతున్నాయి.
 
తాజాగా యాష్ కేజీఎఫ్ 2 కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు యష్ బర్త్ డే సందర్భంగా గత రాత్రి చిత్ర టీజర్ విడుదల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంట 52 నిమిషాలలో 10 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. 
 
చిత్రంలో రమిక అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న రవీనా టాండన్.. యష్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. యశ్ జెమ్‌ లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంతే మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను అని పేర్కొన్నారు. 
webdunia
KGFChapter2Teaser
 
యష్ బర్త్ డే సందర్భంగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన స్టార్సే కాక తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు కూడా అతనికి సోషల్ మీడియా ద్వారా విషస్ తెలియజేస్తున్నారు. యష్ ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో సతీసమేతంగా హీరో నితిన్, నూతన జంటను చూసి ఎగబడిన జనం