Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేజీఎఫ్-2లో బాలయ్య నటిస్తున్నాడా? ఏంటి సంగతి?

Advertiesment
కేజీఎఫ్-2లో బాలయ్య నటిస్తున్నాడా? ఏంటి సంగతి?
, సోమవారం, 28 డిశెంబరు 2020 (12:00 IST)
కేజీఎఫ్-2పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ కావడంతో  అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల అంచనాలకు తగినట్లు ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. 
 
కేజీఎఫ్-2లో సంజయ్ దత్ విలన్ అధీరా పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట. అయితే.. ఈ సినిమాపై మరో వార్త వైరల్‌ అవుతోంది. "కేజీఎఫ్‌-2" లో బాలకృష్ణ నటిస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. అంత భారీ సినిమాలో బాలయ్య లాంటి హీరో నటిస్తున్నారంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. అందుకే కేజీఎప్‌-2లో బాలయ్య నటిస్తున్నారనే విషయం సంచలనంగా మారింది. నిజానికి కేజీఎఫ్‌-2 లో బాలయ్య నటిస్తున్నారని చిత్ర బృందం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
 
కానీ.. గూగుల్‌ మాత్రం కేజీఎఫ్‌-2 సినిమా నటీనటుల జాబితాలో బాలయ్య పేరును చేర్చేసింది. అంతేకాదు... బాలయ్య "ఇనాయత్‌ ఖలీల్‌" అనే పాత్రలో నటిస్తున్నట్టు కూడా ఖరారు చేసింది. కానీ నిజానికి "ఇనాయత్‌ ఖలీల్‌" పాత్రలో వేరే నటుడికి బదులుగా పొరపాటున బాలయ్య పేరు వేసేసింది. దీంతో బాలయ్య పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిహారికకు ఇష్టమైన ఫోటో ఇదే.. సోషల్ మీడియాలో వైరల్