Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ర్కారువారి పాట లీకులు కావాల‌నే చేస్తున్నారా?

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (14:06 IST)
అగ్ర హీరో సినిమాల‌కు ప్రోగ్రెస్ అనేది ఒకేసారి విడుద‌ల చేస్తుంటారు. కానీ సోష‌ల్‌మీడియా వ‌చ్చాక ఏదోర‌కంగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక్కోటి లీక్ అవుతూనే వుంటుంది. సినిమా రిలీజ్ ముందు ఎడిటింగ్‌లో వుండ‌గా, కొన్ని సీన్లు బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం జ‌రిగేది. ఇప్పుడు షూటింగ్ విష‌యాలు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇటీవ‌లే మ‌హేష్‌బాబు న‌టిస్తున్న స‌ర్కారువారి పాట కు సంబంధించి షూటింగ్ దుబాయ్‌లో జ‌రుగుతుండ‌గా కొంత‌మంది అభిమానులు ఆ లొకేష‌న్‌, బేంక్ బిల్డింగ్‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.
 
ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబే స్వ‌యంగా దుబాయ్ ఎడారిలో ఇక్క‌డున్నామంటూ ఫొటోలు పోస్ట్ చేశాడు. అక్క‌డ త‌న కుటుంబ స‌భ్యులుకూడు వున్న ఫొటోలు పెట్టారు. అయితే ఇప్పుడు మ‌హేస్ ఫైట్స్ చేసే స‌న్నివేశాల స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  ఎడారి ఎండ‌లో ఫైట్స్ చేస్తున్నాడు మహేష్. ఛేజింగ్ జరుగుతోంది. మరోవైపు పై నుంచి హెలికాప్టర్లు దూసుకుపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి.
 
బ‌హుశా చిన్న‌వీడియోలు లీక్‌కావ‌డంతో ఇది కావాల‌నే క్రేజ్ కోస‌మే యూనిట్ చేస్తుందా! అనే అనుమానం కూడా క‌లుగుతుంది. ఎందుకంటే ఏదైనా లీక్ అయిన వెంటనే ఫ్యాన్స్ అలెర్ట్ అవుతారు. సదరు ఫొటోలు లేదా వీడియోస్ ను వైరల్ చేయొద్దంటూ రిక్వెస్ట్ పోస్టులు పెడుతుంటారు. అటు యూనిట్ తరఫున డిజిటల్ టీమ్ కూడా రంగంలోకి దిగి వెంటనే వాటిని డిలీట్ చేసే కార్యక్రమం చేపడుతుంది. కానీ సర్కారువారి పాట విషయంలో మాత్రం రివర్స్ లో జరుగుతోంది. అందుకే మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇదొక ఎత్తుగ‌డ అన్న‌ట్లుగా అనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments