Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య ఇంటికి చిరు వెళతారా? వెళ్లరా?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (17:19 IST)
సినిమా షూటింగ్స్ చేసుకోవడానికి పర్మిషన్ అడగడం కోసం చిరంజీవి, నాగార్జునతో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు వెళ్లి తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కలవడం తెలిసిందే. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ తనని కేసీఆర్‌తో మీటింగ్‌కి ఆహ్వానించలేదని... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కొంతమంది సినీ ప్రముఖులు మీటింగ్ పెట్టుకోవడం భూములు పంచుకోవడం కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
 
దీంతో అటు చిరు అభిమానులు, ఇటు బాలయ్య అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. దీంతో బాలయ్య వ్యాఖ్యలపై చిరు స్పందిస్తారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే... జూన్ 10న బాలయ్య పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే... ఇది బాలయ్య 60వ పుట్టినరోజు. అందుచేత బాలయ్య తన సన్నిహితులతో ఈ పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారని తెలిసింది.
 
ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటే చిరంజీవే అని బాలయ్య స్వయంగా చాలాసార్లు చెప్పారు. అయితే... ప్రస్తుతం ఏర్పడిన వివాదం దృష్ట్యా బాలయ్య... చిరంజీవిని తన పుట్టినరోజుకు ఆహ్వానిస్తారా..? లేదా..?.. ఒకవేళ బాలయ్య ఆహ్వానిస్తే.. చిరంజీవి వెళతారా..? వెళ్లరా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. 
 
కరోనా దృష్ట్యా తన పుట్టినరోజును చాలా తక్కువ మంది సమక్షంలో బాలయ్య ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి... చిరుని ఇన్వైట్ చేస్తారో లేదో.. చిరు - బాలయ్య కలుస్తారో లేదో తెలియాలంటే ఈ నెల 10 వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments