Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి పీటలెక్కనున్న 'లూసిఫర్' దర్శకుడు

Advertiesment
పెళ్లి పీటలెక్కనున్న 'లూసిఫర్' దర్శకుడు
, బుధవారం, 3 జూన్ 2020 (14:50 IST)
రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దర్శకుడు సుజిత్. ఆ సినిమా సూపర్‌గా నచ్చడంతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తనను డైరెక్ట్ చేసే అవకాశాన్ని సుజిత్‌కు ఇచ్చాడు. ఫలితంగా సాహో చిత్రం వచ్చింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కలెక్షన్ల పరంగా అదరహో అయినప్పటికీ.. టాక్ పరంగా నిరాశపరిచింది. 
 
అయినప్పటికీ సుజిత్‌కు మరో మెగా ఛాన్స్ లభించింది. మలయాళ చిత్రం లూసిఫర్‌ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలను సుజిత్‌కు చిరంజీవి అప్పగించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్టును తయారు చేసే పనిలో నిమగ్నమైవున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవళ్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకరించారని సమాచారం. ఈ నెల పదో తేదీన ఎంగేజ్మెంట్ అని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిహారిక తులీప్ అందం అదరహో.. భలే ఫోజిచ్చిందిగా..!