Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిహారిక తులీప్ అందం అదరహో.. భలే ఫోజిచ్చిందిగా..!

నిహారిక తులీప్ అందం అదరహో.. భలే ఫోజిచ్చిందిగా..!
, బుధవారం, 3 జూన్ 2020 (14:06 IST)
Niharika
ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్‌లో నటించి.. ఆపై యాంకర్‌గా, హీరోయిన్‌గా ఎదిగిన మెగాడాటర్ నిహారిక ప్రస్తుతం ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అదిరే ఫోజిచ్చింది. ఈ మధ్యే నాన్న నాగబాబు నిహాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. 
 
పెళ్లయ్యేలోపు వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని నిహారిక అంటోంది. అలాగే తమిళంలో ఓ రొమాంటిక్ చిత్రంలో నటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నిహారిక తాజాగా ''తులిప్'' మేగజీన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. 
 
ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మేగజీన్ అయిన తులిప్ పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన కవర్‌పేజీపై నిహారిక హాట్‌గా కనిపించింది. బ్యాక్‌లెస్ ఫోజుతో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తులిప్ కవర్‌పేజీపై కనిపించడం సంతోషంగా ఉంది.. థ్యాంక్యూ ఫ్రెండ్స్ అని కామెంట్ చేసింది. ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిహా అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్‌ను ఇరికించిన నటి.. సామూహిక అత్యాచారం చేస్తారట.. చంపుతారట..!