Webdunia - Bharat's app for daily news and videos

Install App

`పోకిరి`కి మ‌హేష్‌బాబు చేస్తే డౌట్ అన్న‌దెవ‌రు? పూరీ ఏం చేశాడు?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:06 IST)
15 years pokiri
పూరీ జ‌గ‌న్నాథ్ కెరీర్‌లో అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి త‌ర్వాత నంది అవార్డు ద‌క్కిన సినిమా `పోకిరి`. ఈ సినిమా 2006, 28, ఏప్రిల్‌లో విడుద‌లైంది. నేటికి 15 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా తొలుత రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ముందుగా మ‌హేష్‌కు ట్వీట్ చేస్తూ, బెస్ట్ ఆప్ ల‌క్ 15 ఇయ‌ర్స్ అంటూ పోస్ట్ చేశాడు.
 
ఇక `పోకిరి` విష‌యానికి వ‌స్తే, మ‌హేష్‌బాబు ఈ పాత్ర‌కు స‌రిపోతాడా! లేడా! అనే చిన్న అనుమానం అత‌ని అసిస్టెంట్లు లేవ‌నెత్తార‌ట‌. అప్పుడు పూరీ బాగా ఆలోచించి. వారికి `ఒక్క‌డు` సినిమా గురించి చెప్పాడ‌ట‌. ఆ మ‌రుస‌టి రోజు ఆయ‌నే ఆ సినిమా సీడిని వేసి చూపించాడ‌ని యూనిట్ అప్ప‌ట్లో చెప్పింది. క‌ట్ చేస్తే మ‌హేష్‌తో, పూరీ పోకిరి స్టోరీ చెప్ప‌డం, దానికి సూప‌ర్‌స్టార్ కృష్ణ వెంట‌నే ఓకే చేయ‌డం జ‌రిగిపోయాయి.  వెంట‌నే మ‌హేష్ సోద‌రి మంజున నిర్మాత‌గా ప‌ట్టాలెక్కింది. అది ఆ త‌ర్వాత ఎంత సెన్సెష‌న‌ల్ హిట్ అయిందో తెలిసిందే. ఇలాంటివి హిట్ అయ్యాక తెలుసుకుంటే భ‌లేగా అనిపిస్తాయి. ఒక‌ప్పుడు దేశ‌ముదురు సినిమా అల్లు అర్జున్‌కు ముందు పూరీ జ‌గ‌న్నాథ్‌, సుమంత్‌కు చెప్పాడ‌ట‌. మ‌రి సుమంత్ త‌న స్టామినా స‌రిపోద‌ని తిర‌స్క‌రించాడు.
 
ఇక పోకిరి కాంబినేష‌న్ మ‌ర‌లా చూడాల‌ని మ‌హేష్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. మ‌ర‌లా అంత టైం క‌లిసి రాలేద‌ని పూరీ చెబుతుండేవారు. ఇప్పుడు చేయాలంటే కాన్సెప్ట్‌లు కొత్త‌గా వుండాలి. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే, ఒక్కో హీరోకు ఒక్కో స్థాయిని పెంచే సినిమాలు వుంటాయి. అందులో మ‌హేష్‌కు పోకిరి ఒక‌టి. ఈ సినిమా టీవీల్లో ఎన్నిసార్లు వేసినా మ‌రీ మ‌రీ చూడాల‌నిపించేలా వుంటుంది. ఈ సినిమాను హిందీలో కూడా తీశారు. కానీ తెలుగులో మ‌హేస్‌బాబు చేసినంత‌గా సల్మాన్ చేయ‌లేక‌పోయాడ‌ని టాక్ వుంది.
 
దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్లో కూడా అతి పెద్ద బ్రేక్ గా నిలిచిన ఈ చిత్రం సృష్టించిన సునామి అంతా ఇంతా కాదు. మ‌హేస్ ప్యాన్స్ సోష‌ల్‌మీడియాలో తెగ విషెస్ చెబుతున్నారు కూడా. అప్పట్లోనే 40 కోట్ల షేర్ ను రాబట్టి దక్షిణాదిలోనే ఈ మార్క్ అందుకున్న మొట్ట మొదటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ గా పేరు గాంచింది.

అలాగే ఈ సినిమాతోనే హీరోయిన్ ఇలియానాకు కూడా పెద్ద బ్రేక్ వచ్చి తెలుగులో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అలాగే అత్యధిక భాషల్లో రీమేక్ కాబడిన చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమాకు మణిశ‌ర్మ బాణీలు కూడా ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న‌ట్లు పోకిరి2 ఏదైనా వ‌స్తుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments