Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ : ఆగ్రహించిన బాలకృష్ణ... కలత చెంది తప్పుకున్న తేజ!

ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకింత షాక్‌కు గురైంది. అయితే, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ తేజ తప్పుక

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (11:48 IST)
ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నిర్ణయంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకింత షాక్‌కు గురైంది. అయితే, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నారు. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
 
ఈ ప్రాజెక్టు నుంచి ఇంత అర్థంతరంగా తేజ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఎందుకు వదిలేశారన్న చర్చ సాగుతున్న వేళ, సినీ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. తాను ఏ సినిమాలో నటిస్తున్నా, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చే హీరో బాలకృష్ణ, తేజ మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
గతంలో సూపర్ హిట్ అయిన 'వేటగాడు' చిత్రంలోని హిట్ సాంగ్‌తో పాటు జయలలితతో ఎన్టీఆర్ చేసిన ఓ హిట్ డ్యూయెట్ ఈ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని బాలకృష్ణ చెబితే, అందుకు తేజ అంగీకరించలేదని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 
 
అదేసమయంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చిత్రంలో 50 గెటప్పులను బాలయ్య ఫైనల్ చేయగా, వాటి మధ్య డ్యూయెట్లు పెడితే కథ చెడిపోతుందని తేజ తేల్చి చెప్పారు. దాంతో పాటు బాలయ్య ఫైనల్ చేసిన గెటప్స్ ఆయన ఫిజిక్‌కు సూట్ కావని కాడా తేజ చెప్పాడని సమాచారం. అన్నికంటే ముఖ్యంగా, తాను సిద్ధం చేసిన స్క్రిప్టులో బాలకృష్ణ వేలు పెట్టడాన్ని తేజ జీర్ణించుకోలేక పోయారు. ఈ కారణాల వల్లే ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. 
 
ఇక తేజ తప్పుకోవడానికి మరో వర్షన్ ఏంటంటే, మే నెలలో 15 రోజుల షూటింగ్, ఓ సాంగ్‌ను చిత్రీకరించాలని బాలయ్య కోరగా, చాలా హోమ్‌వర్క్ చేయాల్సిన ప్రాజెక్టు కాబట్టి వెంటనే షూటింగ్ సాధ్యం కాదని తేజ తేల్చి చెప్పాడని, దీంతో బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, తేజ తప్పుకున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా ఈ విషయంలో నిజమేంటన్నది అటు బాలయ్య నుంచి గానీ, ఇటు తేజ నుంచిగానీ స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments