Chiranjeevi, Ravi Teja, Bobby Kolli, Naveen Yerneni, Y Ravi Shankar, Chandra Bose
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తూ బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుందనే నమ్మకంతో పనిచేశాం. మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయాయి. ఈ సమయంలో మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెబితే వినాలని మనస్పూర్తిగా అనిపిస్తుంది. ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా వస్తుందంటే దానికి కారణం ఆ సినిమాకి పని చేసే కార్మికులు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పని చేసిన కార్మికులది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు. రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. వాల్తేరు వీరయ్య విజయం సమిష్టి కృషి. సినిమా ఇంత గ్రాండ్ గా చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వలనే సాధ్యమైయింది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. వారితో మళ్ళీ కలసి పని చేయాలని వుంది. దర్శకుడు బాబీ ఈ కథని అద్భుతంగా మలిచారు. అనుభవం తో ఏదైనా సూచన చెబితే.. దాని ఒక సవాల్ గా తీసుకొని ఎక్స్ ట్రార్డినరీ వర్క్ చేశాడు. ఇది అందమైన స్క్రీన్ ప్లే. యంగ్ స్టర్స్ దీనిని ఒక కేస్ స్టడీలా చూడాలి. బాబీ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ సరిగ్గా నిద్రపోలేదు. సినిమాని చాలా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా తీశాడు. అందుకే నిర్మాతలకు ఎలాంటి భారం లేకుండా సజావుగా సాగింది. ఈ రోజు అందరు దర్శకులు విజయం ఇవ్వడం కంటే నిర్మాత బడ్జెట్ కి సినిమా తీయడం మొదటి సక్సెస్ గా భావించాలి. దర్శకులే నిర్మాతలని బ్రతికించాలి. పక్కా పేపర్ వర్క్ చేయాలి. నిర్మాతలు ఉంటేనే నటీనటులు బావుంటారు. నా తమ్ముడు రవితేజ లేకపోతే సెకండ్ హాఫ్ లో ఇంత అందం వచ్చేది కాదు. ఇందులో గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని మా డివోపీ విలన్స్ గారు అన్నారు. ఎదురుగా వున్నది నా తమ్ముడని చెప్పా. రవితేజ లేకపోతే ఆ ఎమోషన్ వచ్చేది కాదు. దేవిశ్రీ తన మ్యూజిక్ తో పూనకాలు తెప్పించాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్ అందరూ అద్భుతంగా పని చేశారు. మంచి కంటెంట్ ఇస్తే ఆదరించి ప్రేక్షకులే తిరిగి థాంక్స్ చెబుతారని వాల్తేరు వీరయ్య నిరూపించింది. ప్రేక్షకులు చెబుతున్న థాంక్స్ కి తిరిగి థాంక్స్ చెబుతున్నాం. అన్నారు
మాస్ మాహారాజా రవితేజ మాట్లాడుతూ.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో వాల్తేరు వీరయ్య తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాను. సక్సెస్ మీట్ లో కలుద్దామని అన్నాను. ఆ నమ్మకం ఈ రోజు నిజమైయింది. చాలా ఆనందంగా వుంది. అన్నయ్య తో ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను. కానీ వాల్తేరు వీరయ్య సందడి వేరు. సినిమా చూసి వచ్చినన చిన్న పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. అంత గొప్పగా కనెక్ట్ అయ్యింది. అన్నయ్యతో ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్ చేయాలని వుంది. థియేటర్లు మొదటి నుండి చివరి వరకూ గోలగోల వుండే ఎంటర్ టైనర్ చేయాలి. బాబీ అది నువ్వే చూడాలి. లవ్ యూ అన్నయ్య. దర్శకుడు బాబీకి బిగ్ కంగ్రాట్స్. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్, చంద్రబోస్ .. అందరికీ కంగ్రాట్స్. దేవిశ్రీ మ్యూజిక్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళారు. ఆయనకి థాంక్స్. మా నిర్మాతలు రవి గారు, నవీన్ గారికి బిగ్ కంగ్రాట్స్. నవీన్ వ్యక్తిత్వం స్వభావం నాకు చాలా ఇష్టం చాలా పాజిటివ్ గా వుంటారు. తనకి అబద్దం ఆడటం రాదు. వున్నది వున్నట్లుగా చెప్పేస్తారు. ఈ సంక్రాంతి మీదే. అందరికీ కంగ్రాట్స్ అన్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య చూసిన ప్రేక్షకులు మా చిరంజీవిని మాకు ఇచ్చావ్ అన్నా అన్నారు. ఒక అభిమాని అయిన దర్శకుడుకి ఇంతకంటే గొప్ప సక్సెస్ ఏం కావాలి. చాలా గర్వంగా అనిపించింది. చిరంజీవి గారికి కోట్లలో అభిమానులులో వున్నారు. వాళ్ళ రూపంలో నేను వచ్చాను. ఈ సినిమా చేసే ప్రయాణంలో ఒక దర్శకుడిగా నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ , ప్రేమ, భోరసా వలనే వాల్తేరు వీరయ్య ఇంత అందంగా వచ్చింది. చిరంజీవి గారు, రవితేజ గారి ఎమోషనల్ సీన్స్ కి క్లాప్స్ కొడుతున్నారు. ఇంత గొప్ప మ్యాజిక్ జరగడానికి వారి మధ్య వున్న ప్రేమ, వాత్సల్యం కారణం. రవితేజ గారు ఎప్పుడూ ఈ సినిమా రష్ చూస్తానని అడగలేదు. ఆయనకి వున్న నమ్మకం అది. హ్యాట్సప్ రవితేజ గారు. ఈ సినిమా చూస్తున్నపుడు ఎమోషన్ ని నమ్ము బాబీ అని బాస్ చెప్పేవారు. ఈ రోజు ఆ ఎమోషనే మా అందరికీ గౌరవం తెచ్చింది పెట్టింది. చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్ గా ఈ సినిమాని చేశాం. చిరంజీవి గారు, రవితేజ గారు లాంటి సెల్ఫ్ మేడ్ స్టార్స్ ని డీల్ చేయడం నా అదృష్టం. ఈ సినిమా ఇంతగొప్పగా నిర్మించిన మా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్, కేథరిన్, ప్రకాష్ రాజ్ గారు అందరూ అద్భుతంగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. మెగాస్టార్ కి ఒక ట్రిబ్యూట్ లా గొప్పగా మలిచారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పూనకాలు లోడింగ్ లాంటి యాక్షన్ ఇచ్చారు. అలాగే పీటర్ మాస్టర్ సముద్రంలో డిజైన చేసిన యాక్షన్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా రైటింగ్ టీం కి కృతజ్ఞతలు. నా ఎడిటర్స్ కి థాంక్స్. ఆర్థర్ విలన్స్ గారు గొప్ప విజన్ తో డీవోపీ గా అద్భుతమైన విస్జువల్స్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీం అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళిన మీడియాకు కృతజ్ఞతలు. ముఖ్యంగా పీఆర్వో వంశీ శేఖర్ టీంకి చాలా థాంక్స్. నేనుసోషల్ మీడియాలో తక్కువగా వుంటాను. వారే ఈ సినిమా గురించి ప్రతిది యాక్టివేట్ చేసి జనాల్లోకి అద్భుతంగా పంపించారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఒక సినిమాని ప్రేమతో చేస్తే ఫలితం ఎంతగొప్పగా వుంటుందో వాలతేరు వీరయ్యతో నిరూపించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు,
నవీన్ యెర్నేని మాట్లాడుతూ... వాల్తేరు వీరయ్య తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాం. ఎంతపెద్ద బ్లాక్ బస్టర్ అంటే చిరంజీవి గారి కెరీర్ బెస్ట్ మూవీ ని చాలా పెద్ద మార్జిన్ తో కొట్టబోతుంది వాల్తేరు వీరయ్య. చాలా ఆనందంగా వుంది. ఈ రోజు ఉదయం కలెక్షన్స్, షోలు చూసిన తర్వాత.. వాల్తేరు వీరయ్య ఖచ్చితంగా ఆల్ టైం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం వుంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా మాకు ఇచ్చిన చిరంజీవి గారికి, రవితేజ గారికి, బాబీ గారికి కృతజ్ఞతలు. నైజాంలో 6.10 Cr, ఉత్తరాంధ్రలో 2.50 Cr , ఈస్ట్ 2.70, యూఎస్ లో ప్రీమియర్ ఫస్ట్ డే కలిపి 1 మిలియన్ కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ సునామీ ఇప్పుడప్పుడే ఆగదు. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్ ట్రార్డినరీ పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ టీం అంతా అద్భుతంగా పని చేశారు. మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. టికెట్ల రేటు విషయంలో వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి, ప్రిమియర్ షోలు విషయంలో వెసులుబాటు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా రెండు సినిమాలు ఒకేసారి విడుదలై, రెండూ బ్లాక్ బస్టర్స్ విజయాలు సాధించడం చాలా రేర్ ఫీట్ అన్నారు.
వై రవిశంకర్ మాట్లాడుతూ పూనకాలు లోడింగ్ అని ఏ ముహూర్తంలో పెట్టేమో కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన వీరయ్య పూనకాలే పూనకాలు . చిరంజీవి గారిని ఎలా చుదలనుకున్నారో అలా చూసేసరికి అందరూ ఎక్సయిట్ అవుతున్నారు. కలెక్షన్స్ అంటే ఇంక వరదలే. ఈ వరదలు ఇప్పుడప్పుడే ఆగవు. రవితేజ గారి స్థానంలో మరొకరి ఊహించలేం. ఆయన ఎస్ అన్నరోజునే సినిమా నెక్స్ట్ లెవల్ లోకి వెళ్ళింది. దేవిశ్రీ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అందరూ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
దేవిశ్రీ ప్రసాద్ : బాబీ ఈ కథ చెప్పినప్పుడే బ్లాక్ బస్టర్ అనిపించింది. 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ అని ముందే ఊహించాను. ఈ రోజు అదే నిజమైయింది. తను కథ చెప్పినప్పుడే టైటిల్ ట్రాక్ ట్యూన్ ఇచ్చాను. ఆ పాట అద్భుతంగా రిచ్ అయ్యింది. పాటలకు, నేపధ్య సంగీతానికి మంచి అప్లాజ్ వచ్చింది. బాస్ ప్రసంసలు అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి నాకు వచ్చిన పేరు,ప్రేమని ని బాబీ గారి అన్నాగారికి అంకితం చేస్తున్నా. బాబీ గారి కసి వున్న దర్శకుడు. ఆయనికి మరిన్ని విజయాలు రావాలి. చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్ లా ఈ సినిమా చేశాం. ఆ ప్రేమ తెరపై కనిపించింది. మెగాస్టార్ గారు , మాస్ మహారాజా గారిని స్క్రీన్ పై చూస్తుంటే ప్రేక్షకులంతా పూనాకాలు లోడింగ్ అంటూ కేరింతలు కొడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నా హోం బ్యానర్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్థర్ విలన్స్, ఎడిటర్ నిరంజన్, చంద్రబోస్, శ్రీనివాస్ రెడ్డి, రోల్ రిడ తదితరులు పాల్గొన్నారు.