Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ నిర్ణయాలని గౌరవించాలి, నమ్మకం వస్తే దర్శకత్వం చేస్తా : మెగాస్టార్ చిరంజీవి

Advertiesment
Megastar Chiranjeevi
, బుధవారం, 11 జనవరి 2023 (16:43 IST)
Megastar Chiranjeevi
`కేవలం ప్రేక్షకుల ఆదరణ నా డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగాలుగుతున్నా. బావగారు బాగున్నారా లో బంగీ జంప్ చేస్తున్నపుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ఎంత ఎక్సయిట్ గా ఫీలౌతారు..వాట్ ఏ ఫీట్ అని క్లాప్స్ కొడతారని ఊహించుకున్న తర్వాత ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. చాలా రిలాక్స్ గా దూకాను. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ నన్ను ముందుకు నడుపుతుంది` అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) మూవీ 'వాల్తేరు వీరయ్య'. శృతి హాసన్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో తీశారు.  జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి విలేఖరుల సమావేశంలో 'వాల్తేరు వీరయ్య'  విశేషాలని పంచుకున్నారు.
 
షూటింగ్ చేస్తున్నపుడు ఆ క్యారెక్టర్  వలన మళ్ళీ యంగేజ్ వైబ్ వచ్చిందా ?
 
ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నాకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంది. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు వివిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే. అయితే రానురాను..ఆర్ధికంగా కమర్షియల్ గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని..  మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధన్యత ఇచ్చాను. కమ్ బ్యాక్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ సైరా, పాటలు, హీరోయిన్ లేకుండా పవర్  ఫుల్ పాత్రగా గాడ్ ఫాదర్ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో వాల్తేరు వీరయ్య చేశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవి ని గుర్తు చేసుకునే అవకాశం వుంటుంది. ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలని రీ కలక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది వాల్తేరు వీరయ్య. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ కూడా. తను ఏం చూడాలని అనుకుంటున్నాడో అవన్నీ నా నుండి రాబట్టుకోవడం కోసం చాలా తపనతో పని చేశాడు. షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగింది.
 
కొత్త దర్శకులతో పని చేస్తున్నపుడు వారికీ కావాల్సిన ఫ్రీడమ్ ని ఎలా క్రియేట్ చేస్తారు ?
 
నేను ఎప్పుడు మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంతవరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను.
 
 రవితేజలో అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు గమనించారు ?
 
రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీ తో వున్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికి ఇప్పటికి అదే ప్రేమ,  ఉత్సాహం వున్నాయి. వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ వుంటుంది. ఆ పాత్రకు చక్కని న్యాయం చేశాడు.
 
మైత్రీ మూవీ మేకర్స్ మేకింగ్ గురించి  ?
 
నిర్మాతల బాగోగులు చూడాల్సిన బాధ్యత దర్శకులపై కూడా వుంది. షూటింగ్ లో ఒక రోజుకి నలభై లక్షల రూపాయిలు కూడా ఖర్చు అయ్యేది. మారేడిమిల్లి లో షూట్ చేస్తున్నపుడు అక్కడ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కూర్చుని ప్లాన్ చేసి ఎక్కడా వృధా కాకుండా చేయగలిగాం. మలేసియాలో కూడా షూట్ చేశాం.
 
గత ముఫ్ఫై ఏళ్ళలో టెక్నాలజీ చాలా మారింది.  బాబీ ఒక అభిమానిగా మిమ్మల్ని ఎలా చూపించబోతున్నాడు ?
 
నేను కంటెంట్ ని బలంగా నమ్ముతాను. బాబీ కూడా కంటెంట్ ని నమ్ముతాడు. అందుకే మా ఇద్దరికి చక్కగా కుదిరింది. దిని అవసరం మేరకు టెక్నాలజీ ని వాడుకోవడం జరిగింది. బాబీ ఫ్యాన్ గా కంటే డైరెక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాయించాడు.
 
వాల్తేరు వీరయ్యలో రవితేజ, మీరు డైలాగులు మార్చుకోవడం ఎలా అనిపించిది ?
ఒక ఫ్యాన్ బాయ్ గా దర్శకుడికి వచ్చిన ఆలోచన ఇది. దీనికి ఇద్దరం ఆమోదించాం. నన్ను ఇష్టపడే రవితేజ కి నా డైలాగ్ చెప్పడం తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్. అలాగే నా తమ్ముడి లాంటి రవితేజ డైలాగ్ ని నేను చెప్పడం సరదాగా అనిపించింది.
 
ఇప్పుడు కథల విషయంలో కొరత ఉందా ?
 
చాలా కొత్త దర్శకులు మంచి మంచి కథలతో వస్తున్నారు. అర్జున్ రెడ్డి, ఉప్పెన, జాతిరత్నాలు, పెళ్లి చూపులు ఇవన్నీ మంచి కంటెంట్ వున్న కథలే కదా.. చాలా మంచి ప్రతిభ వున్న దర్శక, రచయితలు వస్తున్నారు. కథల విషయంలో కొరత లేదు.
 
రిమేక్ సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్నదా ?
ఒక రిమేక్ కథ చేస్తున్నపుడు మన హీరో ఇందులో ఎలా ఉంటాడనే క్యురియాసిటీ వుంటుంది. గాడ్ ఫాదర్ విజయానికి కారణం కూడా ఇదే. కొన్ని మంచి మార్పులు చేసి ఇది చేశాం. అప్పటికే ఆ సినిమా మాతృక చూసినప్పటికీ గాడ్ ఫాదర్ ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు వేదాలం రీమేక్ చేస్తున్నాను. దినిని కూడా చాలా డిఫరెంట్ గా ప్రజంట్ చేస్తున్నాం.
 
దర్శకత్వం చేయాలనే ఆలోచన వుందా ?
జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే వుంది. ఏదొక ఒక సమయంలో ఆలాంటి సందర్భం వచ్చి,  దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను.
 
టికెట్ రేటు ని 25 రూ. పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆరు షోలు వేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది కదా?
 ప్రభుత్వ నిర్ణయాలని మనం గౌరవించాలి. ఈ వెసులు బాటు కల్పించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలుపు మాత్రమే కాదు. అంతకు మించిన విజయం : ఎన్టీఆర్‌