Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిటైర్‌మెంట్‌ గురించి మాట మార్చిన చిరంజీవి!

Chiranjeevi latest
, బుధవారం, 11 జనవరి 2023 (14:39 IST)
Chiranjeevi latest
మెగాస్టార్‌ చిరంజీవి ఈమధ్య రిటైర్‌మెంట్‌ గురించి రెండు సందర్భాల్లో ప్రస్తావించారు. మొదట వాల్తేరు వీరయ్య సెట్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఇంత సీరియర్‌, ఈ వయస్సులో ఒళ్ళు వంచేలా కష్టపడడం అవసరమా? అని ఓ విలేకరి అడిగితే.. అవును. అవసరమే. కెరీర్‌లో మొదట్లో ఎంతటి తాపత్రయంలో వుంటామో. బాగా చేయాలని, అంతే తపన చివరివరకు వుండాలి. లేదంటే రిటైర్‌మెంట్‌ తీసుకుని హాయిగా ఇంట్లో కూర్చోవాలంటూ.. తోటి వారి అందరికీ చెబుతున్నానంటూ వివరించారు.
 
కట్‌ చేస్తే, వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ వైజాగ్‌లో జరిగినప్పుడు ఆయన మాట్లాడుతూ, నాకు రిటైర్‌ అయ్యాక ఇలాంటి ప్రాంతంలో వాతావరణంలో వుండాలనుందని వ్యాఖ్యానించారు. దీనికి రాజకీయ రంగుకూడా పులుముకుంది. ఆ వెంటనే వైసిపి నాయకుడు జగన్‌ బంధువు మాట్లాడుతూ,  చిరంజీవిగారు  ఇలా మాట్లాడినందుకు మేం స్వాగతిస్తున్నాం. చిరంజీవిగారి సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాం అంటూ తెలిపారు.
 
ఇక బుధవారంనాడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విలేకరి అడుగుతూ, ఈమధ్య మీరు రిటైర్‌మెంట్‌ గురించి మాట్లాడుతున్నారు. ఇది అవసరమా? అని అంటే.. నేను రిటైర్‌మెంట్‌ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పాను. తపన వుండాలి. మొదటి సినిమాకు ఎలా పనిచేశామో అంతే ఇదిగా చేయాలి అన్నారు. 
 
మరి అమితాబ్‌లాంటివారు ఇంకా నటిస్తూనే వున్నారుకదా? అని విలేకరి అడిగితే. కరెక్టే. నటుడికి రిటైర్‌మెంట్‌ వుండకూడదు అంటూ.. హాలీవుడ్‌లో క్లయింట్‌ ఈస్ట్‌వుడ్‌ 90దాటిని ఇంకా తపనతో నటిస్తున్నారంటూ బదులు చెప్పారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలిని ముఖర్జీ ఇలా తయారైందేంటి?