Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాల్తేరు వీరయ్య గట్టెక్కేనా! మూవీ రివ్యూ

chiru-raviteja
, శుక్రవారం, 13 జనవరి 2023 (13:06 IST)
chiru-raviteja
నటీనటులు: చిరంజీవి, రవితేజ, కేథరిన్‌ థ్రెసా, శ్రుతి హాసన్‌, ప్రకాష్‌ రాజ్‌, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్‌, నాజర్‌, సత్యరాజ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు.
సాంకేతికత: ఛాయాగ్రహణం: ఆర్థర్‌.కె.విల్సన్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కథ-మాటలు-దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని-రవిశంకర్‌, స్క్రీన్‌ ప్లే: కోన వెంకట్‌-చక్రవర్తి రెడ్డి-బాబీ కొల్లి. 
 
మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ నుంచి మరో హీరోను కలుపుకుని వస్తున్నాడు. అందులో రామ్‌చరణ్‌ వుంటే తర్వాత సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’తో బాలీవుడ్‌ సంజయ్‌ దత్‌ను కలుపుకున్నాడు. ఈసారి రవితేజతో కలిసి చేసిన సినిమా వాల్తేరు వీరయ్య. ఈసారైనా బ్లాక్‌బస్టర్‌ విజయం పొందాలని కామెడీకి, సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చాడు. తన అభిమాని అయిన బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
వాల్తేర్‌ వీరయ్య (చిరంజీవి) వైజాగ్‌లో జాలరి కుటుంబం. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుని జీవించే వృత్తి. ఇలాంటి వ్యక్తి దగ్గరకు మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.ఐ. (రాజేంద్రప్రసాద్‌)  ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ స్మగ్లర్‌ అయిన సాల్మన్‌ సీజర్‌ (బాబీ సింహా)ను మలేషియానుంచి ఇండియా తీసుకురావడానికి సాయం కోరతాడు. వీరయ్య పెట్టిన కండిషన్లకు ఎస్‌.ఐ. ఒప్పుకుని తన బావమరిది వెన్నెల కిశోర్‌ను కూడా తీసుకుని వీరయ్య అతని అనుచరులతో మలేషియా వెళతారు. అక్కడ సాల్మన్‌ సీజర్‌ హోటల్‌లోనే వుంటూ అతని కదలికలు గమనిస్తూంటారు. ఈలోగా అందులో పనిచేసే రిసెప్షనిస్ట్‌ శ్రుతిహాసన్‌ తన టీమ్‌తో సాల్మన్‌పై ఎటాక్‌ చేస్తుంది. ఈ గందరగోళంలో వీరయ్య ఎవరు? అనేది తెలిస్తుంది. సాల్మన్‌ బ్రదర్‌ స్మగ్లర్‌ బాస్‌ ప్రకాష్‌రాజ్‌ కోసమే తను వచ్చానని అందరికీ వీరయ్య చెబుతాడు. వీరయ్యకు అంత పగ ఎందుకు? అనేది తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌తోపాటు మిగిలిన సినిమా చూడాల్సిందే.
  
విశ్లేషణ:
 
‘వాల్తేరు వీరయ్య’ కథ ఇంటర్‌నేషనల్ డ్రగ్‌ మాఫియాపై చిరంజీవి ఎక్కుపెట్టిన అస్త్రం. ఇలాంటి పాయింటే అంతకుముందు గాడ్‌ ఫాదర్‌ వచ్చింది. కానీ కథలోని బ్యాక్‌డ్రాప్‌లు తేడా అంతే. పైగా ఇందులో 20ఏళ్ళనాటి చిరంజీవి నటించిన కామెడీ, అమాయకత్వంతో ఎంటర్‌టైన్‌గా నడిపాడు. సీరియస్‌గా పోలీసు అధికారిగా రవితేజ చేశాడు. రవితేజ తన దాయాది తమ్ముడు. అతని ఆశయం వీరయ్య ఎలా నెరవేర్చాడు అన్నది పాయింట్‌. అందుకే చివర్లో ‘ఇలాంటి అన్నయ్య ప్రతి తమ్ముడికి వుండాలంటూ’ దర్శకుడు బాబీ ముగింపు కార్డ్‌లో చూపిస్తాడు.
 
ఒక స్థాయిచేరాక హీరోలకు కథలు ఇంటర్‌నేషన్‌ మాఫియానే దిక్కు అన్నట్లుగా దర్శకులు కథలు రాస్తున్నారు. కారణం అన్ని రకాల కథలు, సెంటిమెంట్లు వారంతా చేసేశారు. కానీ ఏదో చోట సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందనే ఇందులోనూ బ్రదర్‌ సెంటిమెంట్‌తో దర్శకుడు లాగించేశాడు. మాఫియా సినిమా అంటే వారిని అంతం చేయడానికి వయెలెన్స్‌ కూడా వుండాలి. ఇందులోనూ కావాల్సినంత వుంది. డ్రెగ్‌ వల్ల 25మంది చిన్నారులను బలితీసుకున్న ప్రకాష్‌రాజ్‌కు వీరయ్య ఇచ్చే పనిషిమెంట్‌ సరైందేనని అనిపిస్తుంది. లేదంటే జైలు, కోర్టులు టైమ్‌ వేస్ట్‌ అని ఇలాంటి వారికి తగిన శిక్షతో దర్శకుడు ముగింపు ఇస్తాడు. 
 
ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది. పిల్లలకు కావాల్సిన సన్నివేశాలు చిరంజీవి ఎంటర్‌టైన్‌ చేస్తాడు. అదేవిధంగా యూత్‌కు కావాల్సిన రొమాన్స్‌, పాటలు, డాన్స్‌, ఫైట్స్‌ వున్నాయి. పెద్దలకు కావాల్సిన కుటుంబ బాధ్యత కూడా ఇందులో ఆ పాత్ర ద్వారా చూపించారు. ఇలా అన్ని వర్గాల వారికి నచ్చేలా కథను రాసుకున్నాడు. సంభాషణలు పరంగా కొత్తదనం లేకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. పాటల్లో ‘పూనకాలు లోడింగ్‌’.. యూత్‌ను, మాస్‌ను ఆకట్టుకుంటుంది. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి.. వంటి పాటలు ఓకేలా అనిపిస్తాయి.  
 
చిరంజీవి 20 ఏళ్ళ వెనక్కువెళ్ళి పాత సినిమాల బాడీ లాంగ్వేజ్‌, లుక్స్‌,  డైలాగ్స్‌, కామెడీ టైమింగ్‌, బీడీ కాల్చడం వంటివి బాబీ అండ్‌ టీం చేసిన ప్రయత్నం కొంతమేర ఫలితాన్నిచ్చింది. మెగాస్టార్‌ అభిమానులైతే ఆయన పాత్రతో బాగానే  కనెక్టవుతారు. ఈ దశలో ‘రౌడీ అల్లుడు’, ‘ముఠామేస్త్రి’ ఛాయలు కనిపిస్తాయి.
 
ఇక దర్శకుడిగా ఇంటర్‌వెల్‌ కార్డ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వాన్ని తలపించేలా హింస వుంటుంది. రవితేజ అంటే అభిమానంతో తన మరదలి అయినా థెస్రా  పోలీస్‌ స్టేషన్లో తన దగ్గర ఆశీర్వాదం కోసం వస్తోందని భావించి తన కోసం కాదని చేసే సన్నివేశం ఫన్‌ తెప్పిస్తాయి. రవితేజతో చిరు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
 
‘వాల్తేరు వీరయ్య’ను అభిమానిగా దర్శకు బాబి ఎంటర్‌టైన్‌ చేసేలా చేశాడు. ‘వీరయ్యా వీరయ్యా’ అంటూ వీరత్వానికి మరో పేరులా హీరో పాత్రను డిజైన్‌ చేసినట్లు సంకేతాలు ఇచ్చి ఆ తర్వాత పాత్రను ఫన్‌లోకి తేవడం మాస్‌ ప్రేక్షకుల కోసమే. ఆరంభ సన్నివేశాలతోనే మనం ఒక రొటీన్‌-ఫార్ములా సినిమా చూడబోతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇందులో ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. శ్రుతి పాత్రలో సినిమాటిక్‌ హంగులు కనిపిస్తాయి. ఏజ్‌ తేడా వున్నా హీరోలు తక్కువ వయసున్న హీరోయిన్లను ఎంచుకోవడం కేవలం సినిమాటిక్‌ కోసమే అనేది తెలిసిపోతుంది. 
 
సెకండాఫ్‌లో రవితేజ వచ్చాకే కథలో కొంచెం సీరియస్నెస్‌ వస్తుంది. అన్నదమ్ముల మధ్య వచ్చే సీను, ఇద్దరి మధ్య ఎమోషనల్‌ బాండ్‌ మెప్పిస్తాయి. క్లయిమాక్స్‌లో ఆధ్యాత్మిక జోడిరచి రవితేజ పాత్ర ద్వారా చావు వస్తే ఆ ఛాయలు ఇట్టే తెలిసిపోతున్నాయనేది కూడా సీన్‌లో వెల్లడిస్తాడు. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఓకే. ఎక్కువ రొదలు లేకుండా మాస్‌కు నచ్చేవిధంగా వున్నాయి.   చిరు కోసం.. కామెడీ  కోసం.. రవితేజతో చిరు కాంబినేషన్‌ సీన్ల కోసం ‘వాల్తేరు వీరయ్య’ చూడొచ్చు. విలన్‌ పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ రొటీన్‌ అనిపిస్తాడు. బాబీ సింహా బాగానే చేశాడు. మిగిలిన వారంతా పాత్రల పరిధిలో నటించారు.
 
- ఆర్థర్‌ కె.విల్సన్‌ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా నేపథ్యానికి తగ్గ విజువల్స్‌ అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్షాబీ.. కోన వెంకట్‌.. చక్రవర్తి రెడ్డి కలిసి అందించిన స్క్రిప్టులో మెరుపులు లేవు. ఒక క్రమ పద్ధతిలో కథ రాసుకుని ఆ తర్వాత మిగతా వ్యవహారం చక్కబెట్టినట్లు కాకుండా.. చిరు ఇమేజ్‌ ను దష్టిలో ఉంచుకుని మసాలాలు అద్దుతూ కథ సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది. అయితే సినిమాటిక్‌గా సాగే ఈ కథలో రాజేంద్రప్రసాద్‌ 25 లక్షలు వీరయ్యకు ఆఫర్‌ చేయడం, అందుకు అంగీకరించడం అనేది లాజిక్‌కు అందదు. దానితోపాటు మలేషియాలో అన్ని రోజులు వుండాలంటే అక్కడ అయ్యే ఖర్చుకూడా ఎక్కువే. ఇంత డబ్బు పోలీస్‌కు ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరైనా వున్నారా! అని ట్విస్ట్‌ ఇస్తే బాగుండేది.
 
రేటింగ్‌-2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వీరసింహారెడ్డి'పై ప్రభుత్వం కొరఢా.. అంతు చూసేందుకు యాక్షన్ ప్లాన్