Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వీరసింహారెడ్డి'పై ప్రభుత్వం కొరఢా.. అంతు చూసేందుకు యాక్షన్ ప్లాన్

Advertiesment
VeeraSimhaReddy
, శుక్రవారం, 13 జనవరి 2023 (09:36 IST)
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "వీరసింహారెడ్డి". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఇందులో ఏపీలోని వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో డైలాగులు ఉన్నాయి. ఈ డైలాగులకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం జగన్ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. 
 
ఈ నేపథ్యంలో వాటిని చిత్రంలో ఏయే సందర్భాల్లో ఉపయోగించారు. ఎవరినుద్దేశించి అన్నారో స్వయంగా తెలుసుకోవడానికి కొందరు కీలక అధికారులు గురువారం రాత్రి ఈ సినిమాను చూసినట్టు ప్రచారం జరుగుతోంది. వీరు సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నట్టు గుర్తించారు. ఇదే అంశాన్ని వారు నివేదిక రూపంలో అందజేశారు. దీంతో వీరసింహారెడ్డి సంగతేంటో చూడాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీర సింహారెడ్డి కథ గురించి నిజం చెప్పేసిన నందమూరి బాలకృష్ణ