Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి లాంటి సినిమా కళ్యాణం కమనీయం :హీరో సంతోష్ శోభన్

Santosh Shobhan, Anil Kumar Alla, Priya Bhavani Shankar and others
, గురువారం, 12 జనవరి 2023 (21:30 IST)
Santosh Shobhan, Anil Kumar Alla, Priya Bhavani Shankar and others
పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకరమైన కథనాలతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. కంటెంట్ ఉన్న మూవీ, సకుటుంబంగా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేసే మూవీగా టాక్ రావడం తో పాటు విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్శించాయి.
 
ఈ సందర్బంగా  సంతోష్ శోభన్ మాట్లాడుతూ "దర్శకుడికి, హీరోయిన్ ప్రియ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. ఎలాంటి కోవిడ్ నియమాలు లేని సంక్రాంతి కి ఈ సినిమా రావటం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి బాలకృష్ణ గారి సినిమాలతో సంక్రాంతి కి మళ్ళీ ఒక కళ వచ్చింది, వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమాకి కూడా ఈ అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యువి క్రియేషన్స్ అనేది నా ఫ్యామిలీ, వాళ్ళెప్పుడూ నాకు వెన్నుదన్ను గా ఉంటారు. వంశీ, విక్కీ, అజయ్ అన్న థాంక్స్. అనుభవం ఉన్న డైరెక్టర్ల దగ్గర్నించి ఎంత నేర్చుకున్నానో కొత్త దర్శకుదైన అనిల్ దగ్గర నుంచి కూడా అంతే నేర్చుకున్నా. నాకు దర్శకుడు అంటే దేవుడితో సమానం. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా అది మొత్తం అనిల్ కే దక్కాలి. ప్రియా చాలా బాగా చేసింది తను చేసిన పాత్ర అంత ఈజీ కాదు కానీ అద్భుతంగా చేసింది. థాంక్స్ ప్రియా. శివ పాత్రకి  మొదటి ఆప్షన్ నేను కాదు అది ఎవరో మీరే అనిల్ ని అడగాలి కానీ శృతి పాత్రకి ప్రియా నే మొదటి ఆప్షన్. నా సహనటులు అందరికీ చాలా థాంక్స్. అనిల్ క్రియేటివిటీ ని ఒక్క కార్తీక్ మాత్రమే బాగా అర్థం చేసుకోగలడనిపించింది అంత బాగుంది సినిమాటోగ్రఫీ. శ్రవణ్ భరద్వాజ్ చక్కని సంగీతం ఇచ్చాడు ప్రతీ పాట కథని ముందుకి తీసుకెళ్ళేదిగానే ఉంటుంది. ఎడిటర్ సత్య మరియు టీం అందరికీ చాలా థాంక్స్."
 
హీరోయిన్ ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ "ఇది తెలుగులో నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అలాగే భయంగానూ ఉంది. ఈ సారి తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను. థాంక్స్ టూ యూవీ క్రియేషన్స్ నన్ను చాలా వండర్ఫుల్ గా లాంచ్ చేసారు. అనిల్ మొదటి సినిమాలో నేను పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో ఉన్న శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే. థాంక్స్ సంతోష్, ఒక మంచి కో-స్టార్ గా ఉన్నందుకు. మ్యూజిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందరికీ చాలా థాంక్స్. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి" అన్నారు.
 
దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, "మనం జెన్యూన్ గా ఒక కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ కథ అలా రాసుకున్నదే. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయం లో ఉన్నాయి. నా ఫ్రెండ్ వేదవ్యాస్ నుంచి ప్రారంభమయిన ఈ కథ, యువి వరకి వచ్చింది, యూవీ క్రియేషన్స్ వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ అవసరం రాలేదు.ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ చాలా బాగా చేసారు. ఒక జెన్యూన్ కథ కథనాలతో చేసిన మూవీ ఇది, ఇందులో చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా" అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెన్సార్ పూర్తి చేసుకొని విడుద‌లకు సిద్ధం అయిన దేశం కోసం భగత్ సింగ్