Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క ఆవిష్కరించిన కళ్యాణం కమనీయం ట్రైలర్

Advertiesment
Santosh Shobhan, Priya Bhavani
, గురువారం, 5 జనవరి 2023 (18:42 IST)
Santosh Shobhan, Priya Bhavani
హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రంగా ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా "కళ్యాణం కమనీయం" సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను సంతోషపెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి. శివ ఉద్యోగం సంపాదించి శృతిని హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. శివకు ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా ఎమోషనల్ గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ఇది ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరికి యాప్ట్ అనిపించాయి. మొత్తంగా అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా "కళ్యాణం కమనీయం" చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
 
సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటం అంచనాలు పెంచుతోంది.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ - సత్య జి, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం - కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ - యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరసింహ రాజు, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ - శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత - అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాణం - యూవీ కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం - అనిల్ కుమార్ ఆళ్ల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాజెక్ట్ – కె నుంచి దీపికా పదుకొనే ప్రత్యేక పోస్టర్‌