Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

ఐవీఆర్
శనివారం, 8 నవంబరు 2025 (11:03 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
సమంత రూత్ ప్రభు. ఈ టాలీవుడ్ హీరోయిన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. శుక్రవారం సమంతా రూత్ ప్రభు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒకదానిలో ఆమె తన ప్రియుడు రాజ్ నిడిమోరును కౌగలించుకుని కలిసి పోజులిచ్చింది. ఆమె షేర్ చేసిన పోస్ట్‌లో ఓ కామెంట్ కూడా పెట్టింది. ఆమె వ్యాఖ్యానిస్తూ... గత ఏడాదిన్నర కాలంలో, నేను నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్ దృష్టిని నమ్మడం, నేను ముందుకు సాగుతున్నప్పుడు నేర్చుకోవడం. ఈ రోజు, నేను చిన్న విజయాలను జరుపుకుంటున్నాను అని క్యాప్షన్ ఇచ్చింది.
 
ఆమె ఇంకా ఇలా రాసింది, నేను కలిసిన కొంతమంది ప్రకాశవంతమైన, కష్టపడి పనిచేసే, అత్యంత ప్రామాణికమైన వ్యక్తులతో కలిసి పని చేస్తున్నాను. ఇది నాకు ఓ ప్రారంభం మాత్రమే అంటూ తెలిపింది. ఐతే రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్లో వున్నదని గత కొంతకాలంగా సినీజనం చెప్పుకుంటున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

అంతకుముందు దీపావళి వేడుకలలో కూడా బాలీవుడ్ నటుడు రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజానికి సమంత - రాజ్ నిడిమోరులు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా రాజ్‌తో కలిసి సమతం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 
 
దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు సాగుతున్న ప్రచారం నిజమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా, బాణసంచా కాలుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన సామ్.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని క్యాప్షన్ పెట్టారు. తరచూ వీరిద్దరూ కలిసి కనిపిస్తుండడంతో ఆ ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. 
 
కాగా, రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటడెల్: హనీ బన్నీలో సమంత నటించారు. ఆ సమయంలోనే రాజ్ ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ డేటింగులో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్నో రోజులుగా ఆమె అభిమానులు ఎదురుచూస్తోన్న మా ఇంటి బంగారం త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనితో పాటు రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్ డమ్ ప్రాజెక్టులో సమంత ప్రస్తుతం నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments