Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Advertiesment
Samantha Ruth Prabhu

సెల్వి

, గురువారం, 4 సెప్టెంబరు 2025 (21:47 IST)
Samantha Ruth Prabhu
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు దుబాయ్ వెకేషన్ నుండి ఇటీవల తీసిన రీల్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ రీల్‌లో ఓ వ్యక్తి చేతులు పట్టుకుని కనిపించింది సమంత. ఈ చేయి చిత్రనిర్మాత రాజ్ నిడిమోరు తప్ప మరెవరో కాదని అభిమానులు ఊహిస్తున్నారు. కొన్ని నెలల పాటు రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమాయణం నడుపుతున్నట్లు టాక్ వస్తోంది.  
 
ఈ నేపథ్యంలో దుబాయ్‌లో రాజ్‌తో సమంత షికారుకు వెళ్లిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగినట్లు ఒక నిమిషం దుబాయ్ అనే క్యాప్షన్‌తో ఉన్న సమంత రీల్ వైరల్ అయింది. సమంత సాధారణం కంటే సంతోషంగా కనిపిస్తుందని ఈ రీల్ చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి, కొన్ని గంటల తర్వాత డిటాచ్‌మెంట్ గురించి సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేశారు.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు