టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల ప్రేమకథ 2010లో ఏ మాయ చేసావే సినిమా సెట్స్‌లో ప్రారంభమైంది. కానీ వారి ప్రేమ విడాకులతో ముగిసింది. వారు విడిపోయేందుకు గల కారణం ఏంటని తెలుసుకునేందుకు చాలామంది శ్రద్ధ చూపుతున్నారు. ఇద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. వివాహం చేసుకున్నారు. నేడు, ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. అయినా ఎక్కడా ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడరు. ప్రస్తుతం రాజ్ నిడిమోరుతో ప్రేమలో వున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అలాగే చైతన్య శోభితను వివాహం చేసుకున్నాడు.
అయితే తొలిసారిగా అక్కినేని ఫ్యామిలీ నుంచి చై-సామ్ విడాకుల గురించి చైతూ అత్తమ్మ నాగ సుశీల మాట్లాడుతూ, నాగార్జున, నాగచైతన్య, సుమంత్‌లు స్వతహాగా నటులు.. అందుకే వారున్న రంగంలోని వ్యక్తినే పెళ్లాడారు. అలాంటప్పుడు వారి ఫీల్డ్‌ని అర్ధం చేసుకుంటారని అందరూ అనుకున్నారు.
కానీ చైతన్యకు అలా జరిగింది. ఇందులో మరొకరిని నిందించడానికి ఏం లేదని.. ఏం జరిగినా భార్యాభర్తలే కారణం. భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని, సర్దుకుపోవాలి. కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా విడిపోవడమే మంచిది.
సమాజం కోసమో, ఫ్యామిలీ పరువు కోసమని కష్టపడుతూ కలిసుండాల్సిన అవసరం ఈరోజుల్లో లేదు. ఉన్నది ఒక్కటే జీవితం.. విడిపోయి జీవితంలో ముందడుగు వేస్తే ఇద్దరూ స్నేహితులుగా మిగిలిపోవచ్చు... అంటూ నాగసుశీల తెలిపారు.