Prabhas praises Ghaati trailer it is impressive
అనుష్క లీడ్ రోల్ లో నటిస్తున్న ఘాటీ సినిమాకు తన బెస్ట్ విశెస్ అందించారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఘాటీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుందని, ఇంటెన్స్ గా ఉండి ఆసక్తి కలిగించిందని ఆయన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఈ సినిమా టీమ్ అందరికీ మంచి సక్సెస్ రావాలని ఆయన విశెస్ తెలిపారు. ఇలాంటి పవర్ ఫుల్ రోల్ లో అనుష్కను స్క్రీన్ మీద చూసేందుకు వెయిట్ చేస్తున్నానని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు కీ రోల్ లో నటిస్తున్న ఘాటీ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ నెల 5న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
విడుదలకు ఒక రోజు ముందు రెబెల్ స్టార్ ప్రభాస్ ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. అనుష్క శెట్టి శీలావతి పాత్రలో అదరగొట్టారు. ఘాటీ సమాజం ఎదురుకుంటున్న పరిస్థితులకు ఎదురుతిరి ఆమె చేసిన పోరాటం గూజ్బంప్స్ తెప్పించింది. దర్శకుడు క్రిష్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్, ఎమోషన్ రెండింటిని అద్బుతంగా బ్యాలెన్స్ చేసి అడ్రినలిన్ రష్ ఇచ్చేలా తీర్చిదిద్దారు.
విద్యాసాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో వుంది. రామ్ కృష్ణ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు రియలిస్టిక్‌గా అదిరిపోయాయి. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఘాట్ల, రివల్యూషన్ గ్రాండియర్ రెండింటినీ అద్భుతంగా చూపించింది.
అనుష్క పెర్ఫార్మెన్స్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా వుంది. ఇంటెన్స్, రిజిలియన్స్‌తో కూడిన ఆమె నటనలో ఒక్క డైలాగ్‌తోనే గ్లింప్స్ ఇంపాక్ట్ వచ్చేసింది. విక్రమ్ ప్రభు కూడా ఇంటెన్స్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్షన్, సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్, ఎడిటర్స్ చాణక్య రెడ్డి తూరుపు – వెంకట్ ఎన్. స్వామి వర్క్ కూడా హైలైట్‌గా నిలిచింది.