Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘాటి షూట్ లో కారు బురదలో ఇరుక్కుపోయింది : జగపతిబాబు

Advertiesment
Anuksha, vikram, jagapati babu, krish

దేవీ

, సోమవారం, 1 సెప్టెంబరు 2025 (09:57 IST)
Anuksha, vikram, jagapati babu, krish
కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ఘాటి అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది అని ఘాటి చిత్రం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెలిపారు.
 
విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ చిత్రం గురించి విశేషాలు తెలియజేశారు.
 
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ... చింతకింద శ్రీనివాసరావు గారు గొప్ప రచయిత. మొదటిగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. నేను స్వీటీ వేదం సినిమాలో కలిసి పనిచేశాం. అందులో సరోజ పాత్రను పోషించింది. ఇప్పుడు ఘాటిలో శీలావతిగా మనందరి ముందుకు రాబోతుంది. అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది. ఘాటిలో కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా చేసింది. తను సూపర్ స్టార్ డమ్ లో వుంది. వేదం నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ లో అనేక రెట్లు ఎదిగింది. తన మనసు మాత్రం అలాగే ఉంది. 
 
ఈ సినిమా కథ చెప్పగానే చాలా అడ్వంచర్ తో కూడుకున్న మూవీ తప్పకుండా చేద్దాం అని చెప్పింది. అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. సెన్సార్ కి ఇచ్చేముందు కాపీ చూసుకుని అనుష్కకి ఫోన్ చేశాను. తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఒక ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాను. అదే మాట ఆడియన్స్ కచ్చితంగా చెప్తారు. ఈ కథ రాస్తున్నప్పుడే శీలావతి పాత్ర అనుష్క గారు చేయాలని నేను మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారు సాయిబాబా గారు విక్రమ్ ప్రమోద్ వంశీ డిసైడ్ అయ్యాం. దేశిరాజు క్యారెక్టర్ లో విక్రమ్ ప్రభు గారిని ఊహించుకుని రాశాను. ఆయన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తారు.ఇందులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.  గ్రేట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయనే ఈ పాత్రకు తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకున్నారు. 
 
అలాగే కుందుల నాయుడు క్యారెక్టర్ కి చైతన్య పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ లన్నీ ఎక్స్ట్రార్డినరీ. జగపతిబాబు గారి క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక సూత్రధారిలాగా ఉంటుంది. మొదటి సీను, చివరి సీను ఆయనతోనే ఉంటుంది. ఒక మంచి కథకి మంచి నటీనటులు టెక్నిషియన్స్ దొరకడం అదృష్టం. తోట తరిణి గారు లాంటి ప్రొడక్షన్ డిజైనర్. ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్, సాయిమాధవ్ బుర్ర గారి డైలాగులు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఘాటి సినిమాకి హార్ట్ బీట్ లాంటిది మ్యూజిక్. సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. కనీ, విననీ పాత్రలు ఈ ఘాటిలో చూస్తారు. చాలా మంచి సినిమా తీశాం. ఘాటి సినిమాలో ఒక అందమైన సోల్ ఉంది. ఆడియన్స్ ఆ సోల్ ని మనసులో నింపుకుని వెళ్తారు. సెప్టెంబర్ 5న తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి.
 
యాక్టర్ జగపతిబాబు మాట్లాడుతూ..ఈ సినిమాల్లో చాలా ఘాటుగా ఉండబోతుంది. అన్ని రియల్ లొకేషన్స్ లో చేసిన సినిమా ఇది. ఒకసారి ప్రయాణిస్తున్న కారు బురదలో ఇరుక్కుపోయింది. దాదాపు ఒక 40 నిమిషాలకు రోడ్డు మీదే నిలిచి ఉండిపోయాం. అలాంటి లోకేషన్స్ లో చేశాం. ఈ సినిమా జర్నీ అంత చాలా ఎంజాయ్ చేసాం. ఈ ప్రెస్ మీట్ కి రావడానికి ప్రధాన కారణం క్రిష్, రాజీవ్. చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఈ సినిమా గురించి చెప్పాలని వచ్చాను. 
 
ఈ సినిమాలో నేను పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మంచి చేస్తానా చెడు చేస్తానా ఏం చేస్తానో నాకే తెలియని క్యారెక్టర్. డైరెక్టర్ క్రిష్ గారు చాలా అద్భుతంగా రాశారు. నేను క్రిష్ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ సినిమాతో కలిసి వర్క్ చేసాం. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. రాజీవ్ నిజాయితీ ఉన్న ప్రొడ్యూసర్. తన మాటంటే మాటే.  ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు