Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Advertiesment
Samantha (T)

దేవీ

, గురువారం, 14 ఆగస్టు 2025 (17:42 IST)
Samantha (T)
సమంత తన సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తుంటుంది. వ్యక్తిగతంగా కంటే ప్రస్తుతం ఆమె సినిమాలపై కాన్ సన్ ట్రేషన్ చేస్తుంది. ఇటీవలే తన స్వంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ కింద సినిమాలు కూడా నిర్మిస్తోంది. ఇటీవల ఆమె స్వయంగా నిర్మించిన శుభం అనే చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం, ఆమె నిర్మిస్తున్న మా ఇంటి బంగారం అనే చిత్రంలో కూడా పనిచేస్తోంది. అయితే, ఆమె బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్‌లో ఆమె భాగం కావడంలేదని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి.
 
తాజాగా మరో కొత్త వార్త బయటకు వచ్చింది. రామ్ చరణ్, కార్తీ నటించే సినిమాలో ఐటెం సాంగ్ లో నటిస్తుందని టాక్ టాలీవుడ్ లో నెలకొంది. ఇప్పటికే సనా బుచ్చిబాబు సినిమా మూడొంతుల షూటింగ్ పూర్తయింది. పుష్పలో చేసినట్లుగా సాంగ్ వుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వున్నా అది రిలీజ్ వరకు తెలీయకుండా జాగ్రత్త పడతారనే టాక్ కూడా నెలకొంది.
 
ఇక కార్తీతో తమిళ కైతీ 2 లో కనిపించనుందని సమాచారం. అయితే ఇప్పటికే  అల్లు అర్జున్,  అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో సమంత నటించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వాస్తవం కాదని కూడా తెలుస్తోంది. కానీ ఆమె ఏమి చేసినా, చేయకపోయినా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో సంచలనం పెరుగుతూనే ఉంది. ముందుముందు ఏవేవీ అప్ డేట్ లు వస్తాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్