Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

Advertiesment
samanta - raj diwali celebrations

ఠాగూర్

, మంగళవారం, 21 అక్టోబరు 2025 (09:56 IST)
హీరోయిన్ సమంత దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ నటుడు రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజానికి సమంత - రాజ్ నిడిమోరులు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా రాజ్‌తో కలిసి సమతం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 
 
దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు సాగుతున్న ప్రచారం నిజమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా, బాణసంచా కాలుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన సామ్.. 'నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది' అని క్యాప్షన్ పెట్టారు. తరచూ వీరిద్దరూ కలిసి కనిపిస్తుండడంతో ఆ ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. 
 
కాగా, రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ'లో సమంత నటించారు. ఆ సమయంలోనే రాజ్ ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ డేటింగులో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్నో రోజులుగా ఆమె అభిమానులు ఎదురుచూస్తోన్న 'మా ఇంటి బంగారం' త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనితో పాటు 'రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్ డమ్' ప్రాజెక్టులో సమంత ప్రస్తుతం నటిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు