Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

Advertiesment
chiru - venky family

ఠాగూర్

, సోమవారం, 20 అక్టోబరు 2025 (19:12 IST)
దేశ ప్రజలు దీపావళి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మెగా కాంపౌండ్‌లో జరిగిన ఈ వేడుకల్లో తన స్నేహితులు, టాలీవుడ్ సీనియర్ హీరోలైన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలు తమతమ సతీమణులతో హాజరై ఈ వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అలాగే, హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకలకు హాజరుకావడం ప్రత్యకంగా చెప్పుకోవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మన శంకరవర ప్రసాద్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.
webdunia
 
ఈ వేడుకలపై చిరంజీవి ట్వీట్ చేశారు. "నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్ మరియు నా సహ నటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి మరియు జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ నువ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయి" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా