ప్రతి ఏడాది దీపావళికి తనింటిలో ఘనంగా వేడుకలు చేసుకుని యూ ట్యూబ్ లో వీడియో షేర్ చేసే నటుడు, నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోళ్ళ ఫారమ్ అధినేత బండ్ల గణేష్ తాజాగా దీపావళి సందర్భంగా ఈరోజు రాత్రి తనింటిలో పార్టీ ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ లో వుంటున్న ఆయన ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ఉద్దండుల సమీపంలో వుంటున్నారు.
టాలీవుడ్‌లో ఈ ఏడాది దివాళీ వేడుకలకు కొత్త రంగు చేర్చారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసంలో ఈరోజు రాత్రి భారీ దివాళీ స్పెషల్ పార్టీ జరుగుతోంది. ఈ వేడుకకు సినీ మరియు రాజకీయ రంగాల ప్రధాన ప్రముఖులు హాజరవుతున్నారు.
సమాచారం మేరకు, త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగడంతో ప్రముఖ రాజకీయ నాయకులు దీపావళి పేరుతో బండ్ల గణేష్ ను ఉపయోగించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు చిరంజీవి కూడా వస్తారని టాక్ నెలకొంది. ఓవైసీ నాయకులు కూడా ఈ వేడుకకు రానున్నట్లు సమాచారం. కొద్ది సేపటిలో అసలు వివరాలు తెలియనున్నాయి.