సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

ఠాగూర్
మంగళవారం, 29 జులై 2025 (17:06 IST)
కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను కిడ్నాప్ చేసి తనతో పాటు ఉంచుకుంటానని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం "కింగ్డమ్". ఈ నెల 31వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ పాల్గొని మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలకు ముందు ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. వారిలో ఒకరు హీరో సూర్య. నాకు మొహమాటం ఎక్కువ. ఎవరిని సాయం అడగలేను. కింగ్డమ్ తమిళ టీజర్‌కు సూర్య వాయిస్ ఇస్తే బాగుంటుందని దర్శకుడు తెలిపారు. నేను ఈ మాట అడగ్గానే సూర్య ఓకే చెప్పారు. ఆయన పవర్‌ఫుల్ వాయిస్ టీజర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చేసింది. థ్యాంక్యూ సూర్య అన్నా అని అన్నారు.
 
ఇక రెండో వ్యక్తి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. అతడు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ ఈ పనుల్లో బిజీగా ఉన్నాడు. అతడిని కిడ్నాప్ చేసి నాతోపాటే ఉంచుకోవాలని ఉంది. ఈ సినిమా విషయంలో నేను చెప్పిన అప్‌డేట్స్ కంటే అనిరుధ్ చెప్పినవే వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో కూడా ఈ చిత్రం మా అందరికీ ఒక మైలురాయిగా నిలుస్తుందని అనిరుధ్ చెప్డాడు. ఆ మాటనే ఎంతో మంది షేర్ చేశారు. మరో రెండు రోజుల్లో "కింగ్డమ్" మీ ముందుకురానుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments