Webdunia - Bharat's app for daily news and videos

Install App

''విరాటపర్వం 1992''లో విజయ్ దేవరకొండతో ఫిదా భామ?

''అర్జున్ రెడ్డి''తో హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. మహానటితో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా మరో సూపర్ హీరోయిన్, ఫిదా బ్యూటీ సాయిపల్లవితో జతకట్టేందుకు సై అంటున్నాడు. తెలుగు ప్రేక్షకు

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (16:20 IST)
''అర్జున్ రెడ్డి''తో హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. మహానటితో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా మరో సూపర్ హీరోయిన్, ఫిదా బ్యూటీ సాయిపల్లవితో జతకట్టేందుకు సై అంటున్నాడు. తెలుగు ప్రేక్షకులను ఫిదాతో పలకరించిన సాయిపల్లవి, ఆ తరువాత ''మిడిల్ క్లాస్ అబ్బాయ్'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 
 
ప్రస్తుతం శర్వానంద్‌తో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే అర్జున్ రెడ్డితో రొమాన్స్ చేయనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. శర్వానంద్‌తో 'పడి పడి లేచే మనసు' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే కొంతవరకు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ''నీది నాది ఒకే కథ'' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి సాయిపల్లవి అంగీకరించింది. రేపో మాపో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు ఆమె క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహించే సినిమాలోనూ నటించనుందని టాక్. 
 
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రాంతిమాధవ్.. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్‌గా కొత్త సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాకు ''విరాటపర్వం 1992'' అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే యూత్‌లో మంచి క్రేజున్న విజయ్, సాయిపల్లవి కలిసి నటించే చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని.. ఈ జంటకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

తిరుమల ఘాట్ రోడ్డు: యువకుల ఓవరాక్షన్.. సన్ రూఫ్‌పై సెల్ఫీలు (video)

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments