Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని అలాంటోడు కాదు.. భవిష్యత్‌లో శ్రీరెడ్డి నన్ను కూడా?: విశాల్(Video)

క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై సరైందేనని కొందరు అంటున్నా.. మరికొందరు మాత్రం శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుందని కొట్టిపారేస్తున్నారు. నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి వివాదాస

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (15:33 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై సరైందేనని కొందరు అంటున్నా.. మరికొందరు మాత్రం శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుందని కొట్టిపారేస్తున్నారు. నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి నానిని లక్ష్యంగా చేసుకుని.. విమర్శలు గుప్పించింది. అయితే శ్రీరెడ్డి విమర్శలపై నాని సీరియస్ అయ్యాడు.
 
శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించాడు. ఇందుకు శ్రీరెడ్డి కూడా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇంతలో నాని భార్య అంజనా కూడా సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై మండిపడింది. కొందరు పబ్లిసిటీ కోసం చేస్తున్న వ్యవహారాన్ని ఎవ్వరూ నమ్మరని.. పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారని శ్రీరెడ్డిపై ఫైర్ అయ్యింది. 
 
ఈ వ్యవహారంపై దక్షిణాది నటుడు విశాల్ స్పందించాడు. వ్యక్తిగత కారణాల రీత్యా నానికి మద్దతు పలకట్లేదని.. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నాడు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటాను. కానీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం సరైందని కాదని విశాల్ హితవు పలికాడు. మహిళల పట్ల నాని ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో అతని గురించి తెలిసిన వారందరికీ బాగా తెలుసునని స్పష్టం చేశాడు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే ఆధారాలు చూపించాలి. 
 
కేవలం, వారి పేర్లు బయటపెడితే సరిపోదని.. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఇతరులపై తన ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. భవిష్యత్‌లో తనను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందేమోనని విశాల్ తెలిపాడు. ఆడిషన్ పేరిట అమ్మాయిలను మోసం చేయడం తప్పు. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించి సరైన చట్టాల్లేవన్నాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం