Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓర్ మ్యాక్స్' రేటింగ్.. అగ్రస్థానంలో సౌత్ హీరోలు.. టాప్‌లో విజయ్.. ప్రభాస్

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (21:46 IST)
vijay_prabhas
పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ హీరోల జాబితాలో సౌత్ స్టార్ల హవా కొనసాగింది. భారతీయ సినిమా రంగంలో దక్షిణాది తారల క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఏ భాషలో విడుదలైనా మంచి కంటెంట్ వున్న సినిమాలకు ప్రేక్షకులు ఓటీటీ ద్వారా బ్రహ్మరథం పడుతున్నారు. 
 
జనాలకు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో... అన్ని భాషా చిత్రాలను వీక్షించడానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఉత్తరాదిన కూడా ఊపేస్తున్నాయి. బాలీవుడ్ సైతం విస్తుపోయేలా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి.  
 
మరోవైపు, ప్రముఖ రేటింగ్స్ సంస్థ 'ఓర్ మ్యాక్స్' దేశంలో మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్ సర్వేను నిర్వహించింది. ఈ జాబితాలో టాప్ టెన్ లో జాబితా మొత్తాన్ని దక్షిణాది స్టార్లే సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌కు కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కింది. 
 
టాప్ వన్ స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలిచారు. రెండో స్థానంలో ప్రభాస్, మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఐదో స్థానాన్ని కన్నడ స్టార్ యశ్ ఆక్రమించారు. 
 
బాలీవుడ్‌కు ఆరో స్థానం దక్కడం గమనార్హం. ఆరో స్థానంలో బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రామ్ చరణ్, మహేశ్ బాబు, సూర్య, అజిత్ ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments