Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతనా మజాకా.. అగ్రహీరోయిన్లను వెనక్కి నెట్టేసిందిగా! (video)

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (21:40 IST)
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చేసిన సమంత ప్రస్తుతం తన నటన ద్వారా అగ్ర హీరోయిన్లను బీట్ చేసింది. బాలీవుడ్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన సమంత ముంబైలోనే ఎక్కువగా గడుపుతోంది. 'పుష్ప' సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ 'ఊ అంటావా మామ'తో బాగా పాపులరైంది. ఈ క్రమంలో ఆమెకు ఉత్తరాదిన కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 
 
ఈ క్రమంలో పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ టాప్ టెన్ జాబితాలో సమంత తొలి స్థానాన్ని ఆక్రమించింది. మిగిలిన స్టార్ హీరోయిన్లు అందరినీ ఆమె వెనక్కి నెట్టేసింది. 
 
ఓర్ మ్యాక్స్ సంస్థ వెల్లడించిన అత్యంత పాప్యులర్ పాన్ ఇండియా హీరోయిన్ల సర్వేలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అలియాభట్, నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొణే, రష్మిక మందన్న, కీర్తి సురేశ్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క శెట్టి ఉన్నారు. సమంత ఇలా అగ్ర హీరోయిన్లను వెనక్కి నెట్టడం పట్ల ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments