Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకు.. బతకనివ్వు .. విమర్శకుల చెంప ఛెళ్లుమనిపించిన విద్యుల్లేఖ రామన్

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:43 IST)
తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యుల్లేఖ రామన్‌.. తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. ఇక ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌, కామెడీ టైమింగ్‌ అదుర్స్‌. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం కూడా చేసుకున్నారు. 
 
కరోనా కారణంగా బంధువుల, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా, ప్రస్తుతం ఈ జంట హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ప్రకృతిలో పరవశిస్తున్న ఫొటోలను విద్యుల్లేఖ అభిమానులతో పంచుకుంది. తాజాగా బికినీలో బీచ్‌లో దిగిన ఫొటో షేర్‌ చేస్తూ 'ఏడాదికి రెండుసార్లు ఆరు నెలల పాటు సెలవులు కావాలి' అని పేర్కొంది. 
 
తెలుపు, పసుపు రంగు స్విమ్‌ సూట్‌ ధరించి, కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోకు కామెంట్స్‌ వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. 'విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు' అని అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, విద్యుల్లేఖ రామన్‌ ఘాటుగానే స్పందించారు. 
 
'మహిళలు ఎలా దుస్తులు వేసుకోవాలని నిర్వచిస్తూ కామెంట్స్‌ చేస్తున్న వారికి ఇదే నా స్పందన. ‘మీ విడాకులు ఎప్పుడు?’ అని కామెంట్స్‌ రూపంలో సందేశాలు వస్తున్నాయి. నేను స్విమ్‌ సూట్‌ వేసుకున్నందుకే ఇలా అడుగుతున్నారా? ఆంటీ, అంకుల్స్‌ 1920ల నాటి కాలాన్ని వదిలి 2021కు రండి. సమస్య నెగెటివ్‌ కామెంట్స్‌ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. 
 
ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ వారి వైవాహిక జీవితాల్లో ఆనందంగా ఉన్నారా? జీవితానికి భద్రత, భరోసానిచ్చే, నీతి, నిజాయతీ, విశ్వాసాలు కలిగిన భర్తను పొందిన నేను అదృష్టవంతురాలిని. ఇలాంటి కామెంట్స్‌పై స్పందించటం కన్నా వదిలేయమని ఆయన చెప్పారు. అయితే, అది నావల్ల కాలేదు. 
 
విమర్శకులారా మీ విషపూరిత ఆలోచనలను నేను మార్చలేను. మీరు సంకుచిత స్వభావులు. జీవితంలో వేగంగా తిరోగమన బాట పడుతున్నారు. మీ జీవితంలో మహిళ అంటే కామవాంఛ తీర్చే సాధనంగా, అణిగి మణిగి, ఎలాంటి అవమానాన్నైనా భరిస్తూ ఉండే వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఆమెలోని వ్యక్తిత్వం మీకెక్కడ కనిపిస్తుంది. బతుకు.. బతకనివ్వు' అంటూ కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments